Allu Arjun| నా భార్య న‌న్ను ప్రేమించ‌డం లేద‌ని ఆవేద‌న‌ వెళ్ల‌గ‌క్కిన అల్లు అర్జున్

Allu Arjun| గంగోత్రి సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీకి వచ్చి ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టైలిష్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో బన్నీకి ఐకాన్ స్టార్ అనే బిరుదు వ‌చ్చింది. ఈ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇక పుష్ప‌2తో ప్ర‌భంజ‌నాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. బ‌న్నీ 2012లో స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే . వీరి ప్రేమ‌, పెళ్లి కూడా సినిమా స్టైల్‌లోనే జ‌రిగింది.కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య

  • By: sn    cinema    May 09, 2024 12:17 PM IST
Allu Arjun| నా భార్య న‌న్ను ప్రేమించ‌డం లేద‌ని ఆవేద‌న‌ వెళ్ల‌గ‌క్కిన అల్లు అర్జున్

Allu Arjun| గంగోత్రి సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీకి వచ్చి ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టైలిష్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో బన్నీకి ఐకాన్ స్టార్ అనే బిరుదు వ‌చ్చింది. ఈ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇక పుష్ప‌2తో ప్ర‌భంజ‌నాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. బ‌న్నీ 2012లో స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే . వీరి ప్రేమ‌, పెళ్లి కూడా సినిమా స్టైల్‌లోనే జ‌రిగింది.కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌డం అది ప్రేమ వ‌ర‌కు వెళ్ల‌డం, స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తటపటాయించ‌డం, స్నేహా రెడ్డి నేను అల్లు అర్జున్‌నే చేసుకుంటాన‌ని చెప్ప‌డం ఇలా సినిమా స్టోరీ మాదిరిగానే సాగింది.+

ఇక ఎట్ట‌కేల‌కి వివాహం చేసుకున్న ఈ జంట ఇప్ప‌టికీ అన్యోన్యంగా ఉన్నారు. వారి వైవాహిక జీవితంలో అయాన్, అర్హ అనే ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ త‌న పూర్తి స‌మ‌యాన్ని సినిమాల‌కే కేటాయిస్తుంగా, స్నేహా రెడ్డి మాత్రం ఫ్యామిలీ, పిల్ల‌ల‌కి కేటాయిస్తుంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్నేహా అప్పుడ‌ప్పుడు త‌న పిక్స్‌తో పాటు బ‌న్నీ, అయాన్, అర్హ‌ల క్యూట్ పిక్స్ కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆర్య విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేస‌న ఈవెంట్‌లో త‌న నిజ‌జీవితంలోని వ‌న్ సైడ్ ల‌వ్ గురించి చెప్పుకొచ్చాడు .

యాంక‌ర్ నిజ జీవితంలో వన్ సైడ్ లవ్ గురించి చెప్పాలని అడ‌గ‌గా, దానికి స‌మాధానం ఇచ్చిన బ‌న్నీ… స్నేహారెడ్డితో ఇప్పటికీ నాది వన్ సైడ్ లవ్వే. మనం ప్రేమించడం తప్పితే అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదు అని అంటాడు. అయితే ఈ వ్యాఖ్య‌లు న‌వ్వుతూ చాలా స‌ర‌దాగా చెప్పిన‌వే కాని జ‌నాలు మాత్రం అల్లు అర్జున్ ప్రేమించినంతగా స్నేహారెడ్డి ఆయన్ని ప్రేమించడం లేదా అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా స్నేహా రెడ్డి హీరోయిన్స్ ని మించిన క్రేజ్ సోష‌ల్ మీడియా ద్వారానే సంపాదించింది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్. చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. అందుకోసం వ్యాయామం, యోగా చేస్తారు. ఆమె ఏ ఫోటో షేర్ చేసిన క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతూ ఉంటుంది.