Bigg Boss8|అందం కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స‌ర్జ‌రీలు చేయించుకుంటారంటూ డాక్ట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి తెలుగులో మంచి ఆద‌ర‌ణ లభిస్తుంది. ఇప్ప‌టికే ఏడు సీజ‌న్స్ స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో ఎనిమిదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల షోకి సంబంధించిన ప‌లు ప్రోమోలు విడుద‌ల కాగా, ఇవి షోపై అంచ‌నాలు పెంచాయి.

  • By: sn    cinema    Aug 07, 2024 6:05 PM IST
Bigg Boss8|అందం కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స‌ర్జ‌రీలు చేయించుకుంటారంటూ డాక్ట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి తెలుగులో మంచి ఆద‌ర‌ణ లభిస్తుంది. ఇప్ప‌టికే ఏడు సీజ‌న్స్ స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో ఎనిమిదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల షోకి సంబంధించిన ప‌లు ప్రోమోలు విడుద‌ల కాగా, ఇవి షోపై అంచ‌నాలు పెంచాయి. ప్రోమోని బ‌ట్టి చూస్తే ఈ సారి ఎంట‌ర్‌టైన్‌మెంట్ పీక్స్ లో ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కి సంబంధించిన వివ‌రాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇందులో కొంద‌రు నటీనటులు, యాంకర్లు కూడా ఉన్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

అయితే బిగ్ బాస్ షోకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఓ ప్రముఖ డాక్టర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షో కోస‌మ‌నే కొంద‌రు ప్ర‌త్యేకంగా స‌ర్జ‌రీలు చేయించుకుంటార‌ని స్ప‌ష్టం చేశాడు. అందం కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తన వద్దకు క్యూ కట్టారని , ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ కి ముందు సర్జరీల కోసం తన వద్దకు వస్తారని ఆయ‌న చెప్పుకొచ్చాడు. డాక్ట‌ర్ వ‌ద్దకి వ‌చ్చే కంటెస్టెంట్స్ నా ముక్కుకు, మూతికి సర్జరీ చేయండి అంటారట. వద్దు బాగానే ఉన్నాయని అని చెప్పిన కూడా వారు విన‌ర‌ట‌. వాళ్ల‌కి చేశారు, మాకు ఎందుకు చేయ‌ర‌ని అంటార‌ట‌. డాక్ట‌ర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

బిగ్ బాస్ సర్కిల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా రీతూ చౌదరీ, యాక్టర్ సన, అంజలి పవన్, మై విలేజ్ షో అనిల్, యుదమ్మ రాజు, యాంకర్ వింద్య, కిర్రాక్ ఆర్పీ, బంచిక్ బబ్లూ, గాయత్రి గుప్తా, కుమారీ ఆంటీ, న్యూస్ రీడర్ కళ్యాణి, రేఖ భోజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నేత్ర, సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్, సింగర్ సాకేత్, హీరో అబ్బాస్, రోహిత్, ఊర్మిళ చౌహాన్ కన్ఫర్మ్ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించి హీరో అబ్బాస్ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా రానున్నాడని టాక్ న‌డుస్తుంది.