Britney Spears Divorce | హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడో భర్తతో కూడా విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారితో ఆమె అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన ఎనిమిది నెలల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. బ్రిట్నీ, సామ్ పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి విచారణ జరిపి తీర్పునిచ్చారు. మొత్తంగా పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
Britney Spears Divorce : హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడో భర్తతో కూడా విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారితో ఆమె అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన ఎనిమిది నెలల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. బ్రిట్నీ, సామ్ పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి విచారణ జరిపి తీర్పునిచ్చారు. మొత్తంగా పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారి జంట 2023 జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికి లాస్ ఏంజెల్స్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పెళ్లికి ముందు వీరిద్దరూ దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. బ్రిట్నీ, అస్గారికి పిల్లలు లేరు. అయితే వివాహానికి ఒక నెల ముందు బ్రిట్నీకి గర్భస్రావం అయింది.
వీరిద్దరి మధ్య భవిష్యత్తులో ఏవైనా వివాదాలు ఉంటే ప్రైవేట్ ఆర్బిట్రేషన్‌లో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో వివాహం చేసుకున్నారు. ఏడాది తిరిగే సరికే ఈ జంట విడిపోయారు. 2004లో కెవిన్ ఫెడెర్‌లైన్‌తో రెండో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కుమారులు. 2007లో ఫెడెర్‌లైన్‌తో బ్రిట్నీ విడిపోయారు.
అనంతరం 2016లో నటుడు సామ్ అస్గారితో బ్రిట్నీ స్ఫియర్స్ డేటింగ్ ప్రారంభించారు. 2021 సెప్టెంబర్‌లో ఈ జంటకు నిశ్చితార్థం అయింది. 2022లో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. రెండేళ్లు తిరక్కుండానే విడిపోయారు.