నాన్ లోకల్ అని అప్పుడు గుర్తుకురాలేదా ..? ప్రకాష్ రాజ్
విధాత:‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే తన ప్యానల్‌ను ప్రకటించిన నటుడు ప్రకాష్ రాజ్ గత నాలుగైదు రోజులుగా వస్తున్న పుకార్లు.. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. ‘నా వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని కొందరు అంటున్నారు. ఇంకొందరు మంత్రి కేటీఆర్ ఉన్నారంటున్నారు. ఇంకా కొందరు ఏపీ సీఎం కూడా కలుగజేసుకున్నారని అంటున్నారు.. రేపొద్దున అమెరికా ప్రెసిడెంట్ బైడన్ పేరు కూడా వస్తుందేమో.. అని ఈ […]

విధాత:‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే తన ప్యానల్‌ను ప్రకటించిన నటుడు ప్రకాష్ రాజ్ గత నాలుగైదు రోజులుగా వస్తున్న పుకార్లు.. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. ‘నా వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని కొందరు అంటున్నారు. ఇంకొందరు మంత్రి కేటీఆర్ ఉన్నారంటున్నారు. ఇంకా కొందరు ఏపీ సీఎం కూడా కలుగజేసుకున్నారని అంటున్నారు.. రేపొద్దున అమెరికా ప్రెసిడెంట్ బైడన్ పేరు కూడా వస్తుందేమో.. అని ఈ ప్రెస్‌మీట్ పెట్టాల్సి వస్తోంది’ అని ఇలా చాలా విషయాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
అప్పుడు గుర్తు రాలేదా..?
‘నేను అవార్డులు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కాదు.. రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కాదు..?. నా అసిస్టెంట్స్‌కు హైదరాబాద్‌లో ఇళ్లు తీసుకున్న నాన్ లోకల్ కాదు.. నేను జాతీయ అవార్డులు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కాదు.. మరి ఇప్పుడే ఈ లోకల్.. నాన్ లోకల్ ఇష్యూ ఎందుకు వచ్చింది..?. అసలు లోకల్.. నాన్ లోకల్ ఏంటిది.?. అయినా నన్ను నాన్ లోకల్ అనడం ఇవాళ కొత్తేమీ కాదు. నాన్ లోకల్ అనేది సంకుచిత మనస్తత్వం. వారు ఈ ఫ్యామిలీ.. ఆ ఫ్యామిలీ అని ఫిక్స్ చేయొద్దు. సినిమా పరిశ్రమలో అందరూ అందరికీ కావాల్సిన వారే. నేను పదవుల కోసం పనిచేయడం లేదు’ అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
చిరును ఎందుకు లాగుతున్నారు..?
‘ఈ వ్యవహారంలోకి మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు. మనం ఏ దేశంలో ఉన్నాం. కళాకారులకు లోకల్ ఏంటి..? కళాకారులు యూనివర్శల్ అన్న విషయం తెలుసుకోవాలి. అందరూ ఆశ్చర్యపోయేలా పనిచేస్తాం. కొందరు పెద్దలున్నారు.. వాళ్లు రారు, రావాల్సిన అవసరం కూడా లేదు. నాకు పనిచేసేవాళ్లు కావాలి. క్రమశిక్షణ చెప్పేవాళ్లు కావాలి. మంచు విష్ణుకు ఫోన్ చేసి ఎన్నికలు అసహ్యంగా మారకుండా చూద్దామని అన్నాను. తెలుగులో ఇది నా సిల్వర్ జూబ్లి ఇయర్. రాజకీయంగా నాకు మెగా బ్రదర్ నాగబాబుకు విరోధం ఉన్నా.. ఇక్కడ అంతా ఒక్కటే. ఎవరో ఏదో చేయలేదని చెప్పడానికి నేను రాలేదు. మా ఫ్యానల్‌లో నలుగురు అధ్యక్షులుగా ఉన్నారు. తప్పు చేస్తే నన్ను బయటికి పంపించే గట్టివాళ్లు మా ప్యానల్‌లో ఉన్నారు’ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.