Hema| హేమ‌కి కాస్త ఊర‌ట‌.. ష‌ర‌తుల‌తో బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Hema| బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ న‌టి హేమ‌కి కాస్త ఊర‌ట ల‌భించిందని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం జీ ఆర్ ఫామ్‌హౌస్‌పై బెంగ‌ళూరు పోలీసులు దాడి చేయ‌గా, ఆ స‌మ‌యంలో అక్క‌డ హేమ ఉండ‌డం, ఆమె బ్ల‌డ్ శాంపిల్స్‌ని ప‌రీక్ష‌ల‌కి పంప‌డం, అందులో పాజి

  • By: sn    cinema    Jun 13, 2024 6:36 AM IST
Hema| హేమ‌కి కాస్త ఊర‌ట‌.. ష‌ర‌తుల‌తో బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Hema| బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ న‌టి హేమ‌కి కాస్త ఊర‌ట ల‌భించిందని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం జీ ఆర్ ఫామ్‌హౌస్‌పై బెంగ‌ళూరు పోలీసులు దాడి చేయ‌గా, ఆ స‌మ‌యంలో అక్క‌డ హేమ ఉండ‌డం, ఆమె బ్ల‌డ్ శాంపిల్స్‌ని ప‌రీక్ష‌ల‌కి పంప‌డం, అందులో పాజిటివ్ రావ‌డంతో హేమ‌కి నోటీసులు పంప‌డం వంటివి మ‌నం చూశాం. అయితే పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా హేమ స్పందించ‌క‌పోవ‌డంతో పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి ఆమెని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఆమెని ఉంచారు. అయితే బుధవారం రోజు హేమ బెయిల్ పిటిషన్ పై బెంగుళూరు రూరల్ ఎన్టీపీఎస్ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.

హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించడంతో హేమ‌కి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉండ‌గా, బెయిల్ లభించిన నేపథ్యంలో, ఆమె జైలు నుంచి బయటికి రానున్నారు. హేమకు బెయిల్ లభించడంతో కాస్త ఊరట లభించినట్లయ్యింది.హేమని రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా కఠినంగా స్పందిస్తూ… ఆమె మా ప్రాధమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు మా నిర్ణయం తీసుకోవ‌డం మ‌నం చూశాం.

బెంగ‌ళూరు రేవ్ పార్టీ కేసుతో హేమ పేరు మారుమ్రోగింది. హేమ ఈ పార్టీకి హాజరవటమే కాకుండా, ఆ తరువాత అదే ఫార్మ్ హౌస్ నుండి అక్కడ తాను లేనని ఒక వీడియో చేసి అందరికీ షేర్ చేసింది. అయితే ఆమె వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫార్మ్ హౌస్ నుండి ఆ వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరయిన వారిలో ఉందని ఖరారు చేశారు. అయిన‌ప్ప‌టికీ తాను లేన‌ని చెప్పే ప్ర‌య‌త్నంలో భాగంగా హేమ బిర్యానీ తయారు చెయ్యడం గురించి ఇంకో వీడియో పెట్టింది. అప్పటికే నెటిజన్స్ ఆమెని ట్రోల్ చెయ్యడం మొదలెట్టేసారు.