ప్ర‌కాశ్‌రాజ్ నాన్‌లోక‌ల్ అయితే, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి ఏంటి? బండ్ల గ‌ణేష్‌

విధాత:మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో చాలా మంది ఆయ‌న‌ను నాన్ లోక‌ల్ అని, అత‌ను ఎలా పోటీ చేస్తాడంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. “23 సంవత్సరాల నుంచి ప్రకాశ్‌ రాజ్‌ నాకు ఆప్తులు.ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాలు క‌ళ్లారా చూశాను. ఎంతో మంది క‌ళాకారుల పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు డ‌బ్బులు పంపారు. మంచి వ్య‌క్తి ఆయ‌న‌. ప్రకాశ్‌ రాజ్‌ లోకల్‌, నాన్‌ లోకల్‌ అనడం […]

ప్ర‌కాశ్‌రాజ్ నాన్‌లోక‌ల్ అయితే, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి ఏంటి? బండ్ల గ‌ణేష్‌

విధాత:మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో చాలా మంది ఆయ‌న‌ను నాన్ లోక‌ల్ అని, అత‌ను ఎలా పోటీ చేస్తాడంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. “23 సంవత్సరాల నుంచి ప్రకాశ్‌ రాజ్‌ నాకు ఆప్తులు.ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాలు క‌ళ్లారా చూశాను. ఎంతో మంది క‌ళాకారుల పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు డ‌బ్బులు పంపారు. మంచి వ్య‌క్తి ఆయ‌న‌. ప్రకాశ్‌ రాజ్‌ లోకల్‌, నాన్‌ లోకల్‌ అనడం కరెక్ట్‌ కాదు. “ఇక్కడ పుట్టిన ప్రభాస్‌, రాజమౌళి పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుంటే ఆయన్ను మాత్రం నాన్‌లోకల్‌ అంటారేంటి? ఒకసారి షాద్‌నగర్‌ చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది? అని బండ్ల గ‌ణేష్ త‌న‌దైన స్టైల్‌లో వ్యాఖ్యానించాడు.
నాగ‌బాబు మాట్లాడుతూ.. ‘మా’ అసోసియేషన్‌ను ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రకాశ్‌రాజ్‌ ముందుకు వచ్చారన్నాడు. లోకల్, నాన్‌లోకల్ అనేది అర్ధరహిత వాదన . ‘మా’ సభ్యుడు ఎవరైనా ఇక్కడ పోటీ చేయొచ్చని స్పష్టం చేశాడు. ప్రకాశ్‌రాజ్‌కు అందరం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నామని తెలిపాడు. చిరంజీవి ఇప్ప‌టికే ప్ర‌కాశ్‌రాజ్‌కు మ‌ద్ద‌తిచ్చిన విష‌యం తెలిసిందే.

ReadMore:ఆవేదన తో పుట్టిన ప్యానెల్.. ప్రకాష్ రాజ్

అభిమానికి ధైర్యం చెప్పిన కమలహాసన్