Jayam Ravi | విడిపోతున్న మరో స్టార్‌ కపుల్‌..! సోషల్‌ మీడియా ఫొటోలు డిలీట్‌ చేయడంతో రూమర్స్‌..!

Jayam Ravi | ఇటీవల కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్స్‌ విడాకులు సంచలనంగా మారాయి. ఇప్పటికే ధనుష్‌-ఐశ్వర్య జంట విడాకులు తీసుకున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌-సైంధవి జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో స్టార్‌ కపుల్‌ విడిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఆ జంట ఎవరో కాదు స్టార్‌ హీరో జయం రవి-ఆర్తి దంపతులు.

Jayam Ravi | విడిపోతున్న మరో స్టార్‌ కపుల్‌..! సోషల్‌ మీడియా ఫొటోలు డిలీట్‌ చేయడంతో రూమర్స్‌..!

Jayam Ravi | ఇటీవల కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్స్‌ విడాకులు సంచలనంగా మారాయి. ఇప్పటికే ధనుష్‌-ఐశ్వర్య జంట విడాకులు తీసుకున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌-సైంధవి జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో స్టార్‌ కపుల్‌ విడిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఆ జంట ఎవరో కాదు స్టార్‌ హీరో జయం రవి-ఆర్తి దంపతులు. అయితే, భార్యాభర్తలు ఇద్దరూ తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి ఫొటోలు తీసివేశారు. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. జయం రవి ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా కొనసాగుతున్నాడు. గతేడాది వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్‌లో మెరిశాడు. జయం రవి 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు.

ఆర్తి ప్రముఖ టెలివిజన్‌ నటి సుజాత కూతురు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లు ఉన్నారు. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. అయితే, సన్నిహితులు మాత్రం ఈ రూమర్స్‌ను కొట్టిపడేశారు. తాజాగా జయం రవి తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి భార్య, ఫ్యామిలీ ఫొటోలు డిలీట్‌ చేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అలాగే, ఆర్తి సైతం ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి ఫొటోలు డిలీట్‌ చేసింది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. గతకొంతకాలంగా ఇద్దరూ వేరుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా అవి సఫలం కాలేదని తెలుస్తున్నది. ఈ క్రమంలో విడాకులు అంశం తెరమీదకు వచ్చింది. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలియదు. జయం రవి-ఆర్తి దంపతుల్లో ఎవరో స్పందిస్తూనే క్లారిటీ రానున్నది.