Lokah Chapter 2 | ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్ చేసిన మేకర్స్

‘లోక చాప్టర్ 1’ ఘన విజయం తర్వాత మేకర్స్ సీక్వెల్ ‘లోక చాప్టర్ 2’ను అఫీషియల్‌గా ప్రకటించారు; టొవినో హీరోగా నటిస్తాడు.

Lokah Chapter 2 | ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్ చేసిన మేకర్స్

విధాత : మలయాళంలో డోమినిక్ అరుణ్ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం ‘లోక చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న నేపథ్యంలో మేకర్ సీక్వెల్ ప్రకటించారు. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, కేవలం కొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి రూ.185కోట్లు వసూళ్ల రాబట్టింది. రూ.200కోట్ల క్లబ్ దిశగా దూసుకెలుతుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో, ఇప్పుడు మేకర్స్ సీక్వెల్‌ను ప్రకటించారు.

‘లోక చాప్టర్ 2’ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో లోక చాప్టర్ 1 చిత్రంలో కేమియో రోల్స్‌లో కనిపించిన టొవీనో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. ఈ సారి కథ నాయకుడిగా తోవినో థామస్ నటించనున్నాడు. పోస్టర్‌తో అప్పుడే సీక్వెల్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. దుల్కర్ సల్మాన్ ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, తాను తోవినోతో చేసిన సరదా సంభాషణతో కూడిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సీక్వెల్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.