అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైతన్య త‌న తండ్రి నాగార్జున న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు. జోష్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నాగ చైత‌న్య ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో నాగ చైత‌న్య‌కి పెద్ద‌గా స‌క్సెస్‌లు లేవు. చేసిన సినిమాల‌న్నీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాయి. ప్ర‌స్తుతం తండేల్ అనే చిత్రాన్ని చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తుండ‌గా, ఈ మూవీపై మాత్రం భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ స‌జావుగా సాగ‌డం లేదు అనే చెప్పాలి.

ఏ మాయ చేశావే చిత్రంలో స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డి కొన్నేళ్ల త‌ర్వాత వివాహం చేసుకున్నారు నాగ చైత‌న్య‌. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ జంట ఎంతో అన్యోన్యంగా క‌లిసి జీవించారు.కాని ఏమైందో ఏమో తెలియ‌దు. ఇద్ద‌రు విడాకులు తీసుకొని పెద్ద షాకిచ్చారు. వారి విడాకుల నిర్ణ‌యం ప్ర‌తి ఒక్క‌రికి షాకిచ్చింది. వారు విడాకుల ప్ర‌క‌ట‌న చేసి చాలా ఏళ్లు అవుతున్న‌ప్పటికీ ఇంకా వారి ప్రేమ‌, పెళ్లి, విడాకుల‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు స‌మంత‌, నాగ చైత‌న్య రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. స‌మంత త‌న త‌ల్లిదండ్రుల ఒత్తిడి మేర‌కు రెండో పెళ్లికి సిద్ధ‌మైంద‌ని ఇటీవ‌ల ప్రచారం జ‌రిగింది.

ఇక ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న నాగ చైత‌న్య రెండో పెళ్లికి సంబంధించి ప‌లు ప్ర‌చారాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నాగార్జున నాగ చైతన్య కి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుండ‌గా, ఈ సారి సినిమా అమ్మాయిని కాకుండా వాళ్ళ రిలేషన్స్ లో ఉన్న ఒక అమ్మాయిని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలని నాగ్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వినికిడి. అయితే చైతూ మాత్రం ఇప్పుడు పెళ్లి క‌న్నా సినిమాల‌పైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టాడ‌ట‌. మంచి హిట్ కొట్టాకే చైతూ పెళ్లి చేసుకుంటాన‌ని అన‌డం, నాగార్జున మాత్రం ఈ ఇయ‌ర్ ఎండింగ్ లేదా వ‌చ్చే ఏడాది మొద‌ట్లో త‌న త‌న‌యుడికి పెళ్లి చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం న‌డుస్తుంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది

Updated On 12 Feb 2024 4:04 AM GMT
sn

sn

Next Story