SPIRIT Movie| హైస్పిరిట్స్​లో ప్రభాస్​ ‘స్పిరిట్’​ – రోజురోజుకీ పెరిగిపోతున్న అంచనాలు

కల్కి విజయంతో రెబెల్​స్టార్​ ప్రభాస్(Prabhas)​, యానిమల్(Animal)​ ధమాకాతో సందీప్​రెడ్డి(Sandeep reddy Vanga) వంగా మంచి ఊపు మీదున్నారు. ఇప్పుడు వారిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్నహైఓల్టేజ్​ పోలీస్​ థ్రిల్లర్​ స్పిరిట్(SPIRIT)​పై అభిమానులు భారీ ఆశలు అల్లుకుంటున్నారు. కారణం, స్పరిట్​ టీమ్​ మెల్లమెల్లగా ఒక్కో ప్రత్యేకతను రివీల్​ చేయడమే.

  • By: Tech    cinema    Oct 11, 2024 11:06 PM IST
SPIRIT Movie| హైస్పిరిట్స్​లో ప్రభాస్​ ‘స్పిరిట్’​ – రోజురోజుకీ పెరిగిపోతున్న అంచనాలు

Prabhas’s SPIRIT: అర్జున్​రెడ్డి, కబీర్​సింగ్​, యానిమల్​ సినిమాల బంపర్​ హిట్​తో దర్శకుడు సందీప్​రెడ్డి వంగా ఎక్కడికో వెళ్లిపోయాడు. అందునా కబీర్​సింగ్​, యానిమల్​ హిందీ సినిమాలు కావడంతో ఆయన పేరు దేశవిదేశాలలో మారుమోగిపోయింది. ఇక రెబెల్​ స్టార్​ ప్రభాస్​ గురించి ఎంత చెప్పిన తక్కువే. పాన్​ ఇండియా హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరే ప్రభాస్​. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో స్పిరిట్​ రాబోతోంది. ప్రభాస్​ ఇంకా ఎంటరవలేదు గానీ, షూటింగ్​ మాత్రం మొదలైందని(Shooting started) వినికిడి.

ఇక తారాగణం గురించి బోలెడు వార్తలు షికార్లు చేస్తున్నాయి.  బాలీవుడ్​ ప్రముఖ నట దంపతులు కరీనాకపూర్​–సైఫ్ అలీ ఖాన్(Kareena Kapoor – Saif Ali Khan)​ ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్నా పాత్రలు పోషిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ఇంకో సూపర్​ న్యూస్​ ఏంటంటే, మలయాళ సూపర్​స్టార్​ మమ్ముట్టి(Mammootty) ఈ సినిమాలో కథానాయకుడి తండ్రిగా నటించబోతున్నట్లు, ఈ మేరకు దర్శకుడు మమ్ముటికి కథ చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. కాగా, ఈ చిత్ర బడ్జెట్​ 500 కోట్ల(500 Crores)కు పైగా అని, దర్శకుడు ఏ విషయంలోనూ రాజీపడటం లేదని అంటున్నారు. అటు కల్కి(Kalki 2898AD) విజయంతో ప్రభాస్​, ఇటు యానిమల్​ విజయంతో సందీప్​ పూర్తిగా నో కాంప్రమైజ్​ మోడ్​(No Compromise Mode)లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కథ కూడా సమకాలీన సమస్య అయిన మాదకద్రవ్యాల(Drug issue)పై ఉంటుందని, హీరో ప్రభాస్​ ఏ మాత్రం జాలి,దయ లేని కర్కోటక పోలీసు అధికారి(Ruthless Police Officer) పాత్రలో నటిస్తున్నట్లు, ముంబయి డ్రగ్​ మాఫియాతో తలపడే ఫెరోషియస్​ కాప్​గా ప్రభాస్​ను విభిన్నంగా చూపించే ప్రయత్నం సందీప్​ చేస్తున్నట్లు, ప్రభాస్​ మొదటిసారిగా పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన గెటప్​ కూడా పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

సోషల్​ మీడియాలో ఈ అప్​డేట్లు చూస్తున్న ప్రభాస్​ అభిమానుల స్పిరిట్​ను పీక్స్​కు ఈ ‘స్పిరిట్’​.