సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సౌత్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్ప‌టికీ కూడా సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. 70 సంవత్సరాల వయసులో కూడా యువ హీరోలకు ధీటుగా భారీ బ్లాక్ బస్టర్లు అందుకుంటుండ‌డం విశేషం. రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ సినిమా ఏకంగా రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ర‌జ‌నీకాంత్‌ని ఆయ‌న అభిమానులు న‌టుడిగానే కాకుండా మంచి మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషిగా కూడా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుండ‌డం మ‌న‌కు తెలిసిందే. తన ఆదాయంలో సింహభాగం సేవా కార్య‌క్ర‌మాల‌కే ఖర్చుచేస్తుంటారు త‌లైవా.

ఆయ‌న చేసిన దానం గోప్యంగా ఉంచుతారు. తాను సంపాదించినదంతా తన కూతుర్లు, బంధువులకి కాకుండా సమాజానికే ఇవ్వాలనేది ర‌జ‌నీకాంత్ చిర‌కాల కోరిక‌. త‌న‌ని ఈ స్థానంలో ఉంచింది ప్ర‌జ‌లే కాబ‌ట్టి, వారికే తాను సంపాదించిన ప్ర‌తి రూపాయి చెందాల‌ని ప‌లుమార్లు ర‌జ‌నీకాంత్ త‌న సన్నిహితుల‌కి చెప్పుకొచ్చార‌ట‌. ఇప్ప‌టికే తాను సంపాదించిన డ‌బ్బుని అనాధాశ్రమాలకు, ఛారిటీలకు చెందాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్న‌ట్టు స‌మాచారం.ర‌జనీకాంత్ తీసుకున్న నిర్ణ‌యం నిజంగా గొప్ప‌ది అంటూ ప‌లువురు ఆయ‌న‌ని కొనియాడారు. నిత్యం ఏదో ఒక విష‌యంతో ర‌జ‌నీకాంత్ వార్త‌ల‌లో నిలుస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ర‌జనీకాంత్ తండ్రి ఫొటో ఒకటి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో ర‌జ‌నీకాంత్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రజనీ కండక్టర్‌గా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు కొన్ని బ‌య‌ట‌కు రాగా, ఇందులో ర‌జ‌నీకాంత్ త‌న తండ్రితో కూర్చొని మాట్లాడుతున్న పిక్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ పిక్ చూసిన వారంద‌రు కూడా త‌లైవా అచ్చం త‌న తండ్రి మాదిరిగానే ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ రేర్ పిక్ సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంది. ఇక ర‌జ‌నీకాంత్ త‌ల్లిదండ్రుల పేర్లు విష‌యానికి వ‌స్తే తండ్రి పేరు రామోజీ రావ్ జైక్వాడ్, త‌ల్లి పేరు జీజాభాయ్. ఇక ర‌జనీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో వేదతియాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోఓ మూవీ చేయ‌నున్నాడు.

Updated On 12 Feb 2024 2:36 AM GMT
sn

sn

Next Story