Sreemkhi | శ్రీముఖి మాములిది కాదుగా.. పెళ్లికి ముందు ఒక్క రోజైన ఆ హీరోతో డేటింగ్ చేస్తుంద‌ట‌..!

Sreemkhi: బుల్లితెర రాముల‌మ్మ‌గా స్మాల్ స్క్రీన్‌పై దూసుకుపోతుంది అందాల యాంక‌ర‌మ్మ శ్రీముఖి. ఈ అమ్మ‌డు న‌టిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా స‌త్తా చాటింది. ప‌టాస్ షోతో శ్రీముఖికి మంచి క్రేజ్ ద‌క్కింది.ఇక ఆ క్రేజ్ ఉప‌యోగించుకుంటూ వ‌రుస షోలు చేస్తుంది. బిగ్ బాస్ షోలోకి వెళ్లాక శ్రీముఖి ఇమేజ్ మ‌రింత పెరిగింది. Rashmika Mandanna | రష్మికను నిండా ముంచేసిన మేనేజర్‌.. ఆపై తప్పుడు ప్రచారం ఇప్పుడు టాప్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు కాగా, ఆమె […]

  • By: sn    cinema    Jul 22, 2023 7:10 AM IST
Sreemkhi | శ్రీముఖి మాములిది కాదుగా.. పెళ్లికి ముందు ఒక్క రోజైన ఆ హీరోతో డేటింగ్ చేస్తుంద‌ట‌..!

Sreemkhi: బుల్లితెర రాముల‌మ్మ‌గా స్మాల్ స్క్రీన్‌పై దూసుకుపోతుంది అందాల యాంక‌ర‌మ్మ శ్రీముఖి. ఈ అమ్మ‌డు న‌టిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా స‌త్తా చాటింది. ప‌టాస్ షోతో శ్రీముఖికి మంచి క్రేజ్ ద‌క్కింది.ఇక ఆ క్రేజ్ ఉప‌యోగించుకుంటూ వ‌రుస షోలు చేస్తుంది. బిగ్ బాస్ షోలోకి వెళ్లాక శ్రీముఖి ఇమేజ్ మ‌రింత పెరిగింది.

Rashmika Mandanna | రష్మికను నిండా ముంచేసిన మేనేజర్‌.. ఆపై తప్పుడు ప్రచారం

ఇప్పుడు టాప్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు కాగా, ఆమె దాదాపు అన్ని స్టార్ చానల్స్ తో డీల్ మాట్లాడుకుని .. ప్రతి ఒక్క ఛానల్లో ఏదో ఒక ప్రోగ్రాం ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. మరోవైపు సోష‌ల్ మీడియాలో అందాల జాత‌ర చేయ‌డం, యూట్యూబ్ లో ఫ‌న్నీ వీడియోలు షేర్ చేయ‌డం వంటివి చేస్తూ తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది.

అయితే శ్రీముఖి వ‌య‌స్సు ఇప్పుడు 30 ప్ల‌స్ కాగా, ఆమె త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఇటీవ‌ల శ్రీముఖి త‌న ఫ్యామిలీతో తిరుమ‌ల వెళ్లింది. అక్క‌డ రోజాతో క‌లిసి ఫొటోలు కూడా దిగింది. ఆ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి.

Sreeleela | గంటకు పాతిక లక్షలు.. విత్ జీఎస్టీ! శ్రీలీల డిమాండ్ అంటే ఇలా ఉంటది

ఇంట్లో శుభ‌కార్యం జ‌రిగే ముందు ఇలా తిరుమ‌లకి వెళ‌తార‌ని, శ్రీముఖి కూడా సడన్ గా ఇలా తిరుమలలో ప్రత్యక్షమవడంతో ఆమె పెళ్లికి మ‌రెన్నో రోజులు స‌మ‌యం లేద‌ని కొంద‌రు జోస్యాలు చెప్పుకొచ్చారు. కాని ఈ అమ్మ‌డి జోరు చూస్తుంటే ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదు.

రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్న శ్రీముఖిని ఫైమా ఓ ప్ర‌శ్న అడిగింది. నీకు పెళ్లి వద్దా? అని అనడంతో, మనకు ఏ హీరో సెట్ అవుతాడు? అంటూ శ్రీముఖి అంటుంది. అప్పుడు ఫైమా.. ప్రభాస్ ఒక్క‌డే పెళ్లి కాకుండా ఉన్నాడ‌ని చెప్ప‌డంతో వెంట‌నే శ్రీముఖి అయితే నా పెళ్లికి ఒక రోజు ముందు అత‌నితో డేట్‌కి వెళ‌తాను అంటుంది.

Abhay Ram | అక్కాతమ్ముళ్లుగా.. మహేశ్‌ కూతురు సితార, NTR వారసుడు అభయ్ రామ్! ఎంట్రీ నిజం కాదా?

అప్పుడు క‌ల‌లో వెళ‌తావా అంటూ ఫైమా పంచ్ వేస్తుంది. మొత్తానికి శ్రీముఖి త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ని ఇలా బ‌య‌ట‌పెట్టేసింది. ఇక గత రెండు మూడేళ్ళలో శ్రీముఖి కెరీర్ బాగా పుంజుకోగా, ఒక‌వైపు షోలో చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌తో కూడా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Renu Desai | మీకు అంత సీన్ లేదంటూ రేణూ దేశాయ్‌కి నెటిజ‌న్ల చుర‌క‌లు.. ఇంత‌కీ ఆమె ఏం చేసింది..!

Venu Swamy | మెగా డాటర్ నిహారిక‌ మళ్లీ పెళ్లి.. అందులోనూ?: వేణు స్వామి