జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

విధాత‌: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. దాదాపు 26 మంది గాయపడ్డారు. ఓ మినీ బస్సు పూంఛ్‌ నుంచి గలిమైదాన్‌ వైపు వెళ్తుండగా సాజియాన్‌ వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మండిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం తెలుసుకుని సైన్యం, స్థానిక పోలీసులు రంగంలోకి […]

  • By: Somu    crime    Sep 14, 2022 7:14 AM IST
జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

విధాత‌: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. దాదాపు 26 మంది గాయపడ్డారు. ఓ మినీ బస్సు పూంఛ్‌ నుంచి గలిమైదాన్‌ వైపు వెళ్తుండగా సాజియాన్‌ వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను మండిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం తెలుసుకుని సైన్యం, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంపై జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.