నంది విగ్రహం దొంగలు దొరికారు..

విధాత‌: 06.08.2021 వ తేది అర్ధరాత్రి దాటిన తరువాత బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలో గల పురాతన శ్రీ గోలింగే శ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న పురాతన రాతి నంది విగ్రహం చోరీకి గురి అయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై ఆలయ నిర్వాహకులైన ఆర్కియాలజీ శాఖకు చెందిన నొడగల బుజ్జి బాబు ఇచ్చిన రిపోర్టు పై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో Cr.No.189/2021 U/s 457,380 IPC గా కేసు నమోదు […]

నంది విగ్రహం దొంగలు దొరికారు..

విధాత‌: 06.08.2021 వ తేది అర్ధరాత్రి దాటిన తరువాత బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలో గల పురాతన శ్రీ గోలింగే శ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న పురాతన రాతి నంది విగ్రహం చోరీకి గురి అయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై ఆలయ నిర్వాహకులైన ఆర్కియాలజీ శాఖకు చెందిన నొడగల బుజ్జి బాబు ఇచ్చిన రిపోర్టు పై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో Cr.No.189/2021 U/s 457,380 IPC గా కేసు నమోదు చేయడం జరిగినది.

ఈ కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు స్వయంగా నేర స్థలాన్ని పరిశీలించి సేకరించిన ఆధారాలపై సమీక్ష అనంతరం వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, రామచంద్రాపురం DSP D.బాలచంద్ర రెడ్డి, కాకినాడ CCS DSP S.రాంబాబు, అనపర్తి CI NV భాస్కరావు, కాకినాడ CCS -II CI ప్రశాంత్ బాబు, బిక్కవోలు SI P.వాసు, అనపర్తి SI మహేశ్వరరావు పోలీసు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినారు. జిల్లా అడిషనల్ SP అడ్మిన్ కె. కుమార్ పర్యవేక్షణలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఈ ప్రత్యేక పోలీస్ బృందాలు గాలించి సాంకేతిక పరిజ్ఞానం, ఇతర సేకరించిన ఆధారాలతో ఈ కేసును త్వరితగతిన ఛేదించడం జరిగింది.

ఈ కేసు దర్యాప్తులో ప్రత్యేక పోలీస్ బృందాలకు ఈ చోరీకి పాల్పడిన నేరస్థుల నేపధ్యం గూర్చి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసాయి. ఈ చోరికి పాల్పడిన నిందితులు నలుగురు ఉన్నత చదువులు చదువుకొని ఆర్ధిక ఇబ్బందులకు లోనయి మూఢ నమ్మకాలతో పాత పురాతన విగ్రహాలలో విలువైన వజ్రాలు వుంటాయి అనే అత్యాశతో గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక చారిత్రాత్మక పురాతన దేవాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లి రెక్కి నిర్వహించడం జరిగింది.

ముద్దాయిలు ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా లో రెక్కి చేసి ఫోటోల ద్వారా సేకరించిన విగ్రహాల వివరాలు.

  1. వీరభద్ర స్వామి, నంది విగ్రహం ఉంచాల (v), కర్నూల్ జిల్లా
  2. వినాయకుని బొమ్మ, నంది విగ్రహం ఎనమదల (v), గుంటూరు జిల్లా
    ౩. మూడు నంది విగ్రహలు గూడూరు (v), నెల్లూరు జిల్లా
  3. నల్ల నంది విగ్రహం గూడూరు (v), నెల్లూరు జిల్లా
  4. నల్ల నంది, గోల్డ్ రంగు లో నగలు ఒంగోలు లోని శివాలయం
  5. శిల్ప కళలతో ఉన్న నంది నెల్లూరు జిల్లా
  6. స్తంబం మీద నంది బొమ్మ వినుకొండ శివాలయం
  7. నెమలి బొమ్మ నెల్లూరు జిల్లా
  8. నంది విగ్రహం, కమ్మం పాడు (v) గుంటూరు జిల్లా
  9. నాగులు బొమ్మ, పగిలిన దేవుడు బొమ్మ నర్సాపురం, ప్రకాశం జిల్లా
  10. తెల్ల నంది విగ్రహం కూడురి (v) నెల్లూరు జిల్లా
  11. పసుపు నంది విగ్రహంఇంజమురు (v), నెల్లూరు జిల్లా
  12. శివాలయం గుడి జగిత్యాల జిల్లా, తెలంగాణా
  13. నల్ల నంది విగ్రహం సోమేశ్వరం (v), తూ. గో.జిల్లా
  14. నంది విగ్రహం బిక్కవోలు (v), తూ. గో.జిల్లా

04-08-2021 ఉదయం ఈ కేసులో అరెస్ట్ కాబడిన ప్రధాన ముద్దాయి చుక్కపట్ల ప్రసాద్ కు చెందిన కారులో సహచర ముద్దాయిలు అయిన గువ్వల భాస్కరరెడ్డి, కుంచాల వెంకటేష్ లు, ముగ్గురు బిక్కవోలు ఆలయానికి వచ్చి లోపల విగ్రహం చోరి నిమిత్తం రెక్కి నిర్వహించుకొని వెళ్లారు. వాల్లు వేసుకున్న ప్రణాళికను అమలుచేసే పనిలో భాగంగా 06-08-2021 అర్థరాత్రి దాటిన తరువాత వారి కారును గుడి వెనుక భాగంలో నిలిపి ఆలయ ప్రహరి గోడను దూకి లోనికి ప్రవేశించి అతిపురాతన రాతి నంది బొమ్మను దొంగలించుకొని వచ్చిన కారులో G.మామిడాడ మార్గంలో వెళుతూ వారితో పాటు తెచ్చుకున్న సుత్తితో నంది విగ్రహాన్ని పగలగొట్టి చూడగా అందులో విలువైనవి ఏమి లేకపోవడంతో పగిలిన విగ్రహం రాతి ముక్కలను రోడ్డు పక్కనే ఉన్న పొదలలో పడేసి అటు నుంచి గుంటూరు వెళ్ళిపోయారు.

అరెస్ట్ అయిన‌ ముద్దాయిలు:

A-1) చుక్కపట్ల ప్రసాద్ s/o వెంకటేశ్వరరావు, వయసు 30 సం.లు, గుంటూరు జిల్లా, (చదువు MCA).

A-2) కుంచాల వెంకటేష్ s/o కొండయ్య, వయసు 26 సం.లు, కందుకూరు(v), ప్రకాశం జిల్లా, వృత్తి తాపి పని.

పరారిలోవున్న ముద్దాయిలు:
A-3) గువ్వల భాస్కరరెడ్డి, (చదువు MBA). ఒంగోలు వాసి.

A-4) రవి పంతులు, నెల్లూరు వాసి.

14-08-2021 తేదిన A-1 & A-2 లను అరెస్ట్ చేసి, పగలగొట్టబడిన నంది విగ్రహం యొక్క రాతి ముక్కలను G-మామిడాడ నరసరావుపేట రోడ్డు పక్కన పొదలలో వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం స్వాధీనం చేసుకొని ఈ నేరం చేయుటకు ఉపయోగించిన AP07EB5355 Swift Dzire (white colour) car ను దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగినది. చోరీ లో పాల్గొన్న ఒంగోలు కు చెందిన A-3 గువ్వల భాస్కరెడ్డి ఇటువంటి ప్రాచీన దేవలయాలకు చెందిన రాతి విగ్రహాలలో వజ్రాలు ఉంటాయని నమ్మబలికి ప్రోత్సహించిన నెల్లూరు కు చెందిన A-4 రవి పంతులు అరెస్ట్ కావలసి ఉన్నది. ఇరువురి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

జిల్లా SP గారి స్వీయ మార్గదర్శకత్వంలో ఇచ్చిన ఆదేశాలు సూచనలకు అనుగుణంగా ఈ కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన, రామచంద్రాపురం DSP D బాలచంద్ర రెడ్డి, అనపర్తి CI NV భాస్కరరావు, బిక్కవోలు SI P.వాసు, అన్నవరం SI రవికుమార్, అనపర్తి SI P.ఉమామహేశ్వరరావు పి.సి.లు వీరబాబు, రవీంద్ర, త్రిమూర్తులు, రమణ మరియు దర్యాప్తులో త్వరితగతిన, సమయానుకుల సాంకేతిక సహకారం అందించిన జిల్లా IT Core CI రామచంద్రరావును వారి సిబ్బందిని, జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.