Medak: ఘోర రోడ్డు ప్రమాదం: కారు బోల్తా.. యువకుడు మృతి

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా మనోహరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి కృష్ణవేణి శ్రీనివాస్ దంపతుల కుమారుడు భోజేందర్ కుమార్ 25 మృతి చెందాడు. బోజేందర్ కుమార్ మారుతి సుజుకి కారు నెంబర్ AP 09 CD 3750 కారులో హైదరాబాద్ […]

  • By: krs    crime    Dec 05, 2022 3:57 PM IST
Medak: ఘోర రోడ్డు ప్రమాదం: కారు బోల్తా.. యువకుడు మృతి

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా మనోహరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి కృష్ణవేణి శ్రీనివాస్ దంపతుల కుమారుడు భోజేందర్ కుమార్ 25 మృతి చెందాడు.

బోజేందర్ కుమార్ మారుతి సుజుకి కారు నెంబర్ AP 09 CD 3750 కారులో హైదరాబాద్ నుంచి నిజామా బాద్ వైపు సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో బ‌య‌లుదేరాడు. మనోహరాబాద్ రామాయపల్లి గ్రామ శివారులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత, ఎన్.హెచ్ 44 రోడ్డు పై ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్‌కు బోజేంద‌ర్ కారును ఢీకొట్టాడు.

దీంతో కారు రోడ్డుపై బోల్తా పడి భోజేందర్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మనోహరాబాద్ ఎస్ ఐ రాజు గౌడ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అనంత‌రం మృతిడిని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.