Chhattisgarh | బలిచ్చిన యజమానిని.. బలిగొన్న గొర్రె!
Chhattisgarh రాయ్‌పూర్: కొన్ని యాదృచ్ఛికంగా జరిగినా.. సందర్భోచితంగా అన్వయించుకోవచ్చు. గొర్రెలు పగ బడతాయా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ గొర్రెపోతు మాత్రం పగ తీర్చుకున్నట్టే కనిపిస్తున్నది. తనను బలిచ్చిన వ్యక్తి తిన్న మాంసం రూపంలో వచ్చి.. బలిగొన్నది! ఎలాగంటారా.. ఈ కథనం చదవండి! తన మొక్కు తీరినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాకు చెందిన బగర్‌సాయి అనే ఓ 50 ఏళ్ల వ్యక్తి గొర్రెపోతును బలిచ్చేందుకు సిద్ధపడ్డాడు. మదన్‌పూర్ గ్రామానికి చెందిన ఇతర కుటుంబీకులతో కలిసి.. ఖోపాధామ్ […]

Chhattisgarh
రాయ్‌పూర్: కొన్ని యాదృచ్ఛికంగా జరిగినా.. సందర్భోచితంగా అన్వయించుకోవచ్చు. గొర్రెలు పగ బడతాయా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ గొర్రెపోతు మాత్రం పగ తీర్చుకున్నట్టే కనిపిస్తున్నది. తనను బలిచ్చిన వ్యక్తి తిన్న మాంసం రూపంలో వచ్చి.. బలిగొన్నది! ఎలాగంటారా.. ఈ కథనం చదవండి!
తన మొక్కు తీరినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాకు చెందిన బగర్‌సాయి అనే ఓ 50 ఏళ్ల వ్యక్తి గొర్రెపోతును బలిచ్చేందుకు సిద్ధపడ్డాడు. మదన్‌పూర్ గ్రామానికి చెందిన ఇతర కుటుంబీకులతో కలిసి.. ఖోపాధామ్ వద్దకు ఆదివారం చేరుకున్నాడు. అక్కడ గొర్రెపోతును బలిచ్చాడు. నెత్తురోడుతూ ఆ గొర్రెపోతు ఒరిగిపోయింది. దానిని చక్కగా ముక్కలు కోసి.. కూర వండారు. అంతా కలిసి భోజనానికి కూర్చున్నారు.
ఎవరైతే మొక్కు తీర్చుకునేందుకు గొర్రెపోతును బలిచ్చాడో.. ఆ వ్యక్తికి ఆ గొర్రెపోతు కంటిగుడ్డు కూరలో వచ్చింది. దాన్ని ఇష్టంగా చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా గుటుక్కుమనిపిద్దాం అనుకున్నాడు సదరు వ్యక్తి. కానీ.. అది మృత్యురూపంలో వచ్చిన గొర్రెపోతు అని గుర్తించలేక పోయాడేమో.. అది కాస్తా బగర్ సాయి గొంతులో చిక్కుకుపోయింది.
అయితే.. ఎంత ప్రయత్నించినా బయటకూ రాలేదు.. లోపలికీ పోలేదు. చాలా సేపు అలా ఇబ్బంది పడిన బగర్ సాయిని బంధువులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుపోయారు. కానీ.. అప్పటికే గొర్రెపోతు పగ తీర్చుకున్నదేమో.. బగర్‌సాయి అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.