Delhi Liquor Scam: ఎమ్మెల్సి కవిత విచారణకు రావాలి!

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీస్ లు ఇచ్చింది

Delhi Liquor Scam: ఎమ్మెల్సి కవిత విచారణకు రావాలి!

విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీస్ లు ఇచ్చింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. గత మార్చిలో మూడు రోజులపాటు కవితను ఈడీ విచారించింది. ఈడీ విచారణపై గతంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది . సుప్రీంకోర్టు తన పిటిషన్ పై స్పష్టత ఇచ్చాకే విచారణకు హాజరవుతానని గతంలో కవిత ఈడీకి తెలిపింది.

ఈ నేపథ్యంలో కవితకు తాజాగా ఈడీ జారీ చేసిన నోటీస్ లపై ఆమె ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఇటీవల మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికి ఆయన విచారణకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో కవిత వైఖరి ఎలా ఉంటుందన్నది చర్చనియాంశమవుతోంది.