సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్.. రూ.50లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
హైద్రాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది.

హైద్రాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. బాధితుడి భార్యకు ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసిన దుండగులు రూ.50లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
కారులో వచ్చిన దుండగులు రాయదుర్గం కమిషనరేట్ కార్యాలయం పక్కనే ఉన్న కేర్ ఆసుపత్రి వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఆర్ధిక లావాదేవిల నేపధ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్లుగా భావిస్తున్నారు