హన్మంతుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధారాలను ప్రకటించింది. ఆంజనేయుని జన్మస్థలానికి సంబంధించిన పలు ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధరశర్మ వెల్లడించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలోని అంజనాద్రే హన్మంతుని జన్మస్థలం స్పష్టం చేశారు. హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నామని, ఆంజనేయుని జన్మస్థలంపై అన్వేషణ కొనసాగిందని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించామని వివరించారు. వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని తెలిపారు. పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక […]
హన్మంతుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధారాలను ప్రకటించింది. ఆంజనేయుని జన్మస్థలానికి సంబంధించిన పలు ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధరశర్మ వెల్లడించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలోని అంజనాద్రే హన్మంతుని జన్మస్థలం స్పష్టం చేశారు. హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నామని, ఆంజనేయుని జన్మస్థలంపై అన్వేషణ కొనసాగిందని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించామని వివరించారు. వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని తెలిపారు. పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపారు.
త్రేతాయుగంలో వేంకటాచలాన్ని అంజనాద్రిగా పిలిచారని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. అంజనాద్రికి హనుమ పట్టాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని పేర్కొన్నారు. అంజనాదేవికి హన్మంతుడు ఇక్కడ పుట్టడం వల్లే అంజనాద్రి అని పేరు వచ్చిందని తెలిపారు. అంజనాద్రిలో పుట్టి వేంకటేశ్వరస్వామికి ఆంజనేయుడు సేవ చేశాడని చెప్పారు. కర్ణాటకలోని హంపి హన్మంతుడి జన్మస్థలం కాదని తెలిపారు. హంపి కాదని చెప్పడానికి తమ వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆచార్య మురళీధరశర్మ స్పష్టం చేశారు.Anjaneyaswamy vari Janmastalam
సూర్యబింబం కోసం హనుమ వేంకటగిరి నుంచే గాల్లోకి ఎగిరాడని తెలిపారు. హనుమ తిరుమల కొండల్లోనే పుట్టాడని 12 పురాణాలు చెబుతున్నాయి పేర్కొన్నారు. 12, 13వ శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని తెలిపారు. వాల్మీకి రామాయణం తర్జుమా కంబరామాయణంలోనూ ఈ ప్రస్తావన ఉన్నట్లు స్పష్టం చేశారు. అన్నమయ్య కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని ఆచార్య మురళీధరశర్మ వివరించారు.