Eye twitching | కన్ను అదిరితే లాభమా..? నష్టమా..? ఏ కన్ను అదిరితే ఎవరికి మంచిది..??
Eye twitching | రాతి యుగం నుంచి నేటి వరకు ప్రజలు ఎన్నో నమ్మకాలతో బతుకుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఇలా మూఢనమ్మకాలను నమ్మడం వల్ల చాలా వరకు నష్టాలే జరుగుతాయి కానీ లాభాలు జరగవు. అది కేవలం ఒక నమ్మకం మాత్రమే. అదే జీవితంలో జరుగుతదని భావించడం సరికాదు.

Eye twitching | రాతి యుగం నుంచి నేటి వరకు ప్రజలు ఎన్నో నమ్మకాలతో బతుకుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఇలా మూఢనమ్మకాలను నమ్మడం వల్ల చాలా వరకు నష్టాలే జరుగుతాయి కానీ లాభాలు జరగవు. అది కేవలం ఒక నమ్మకం మాత్రమే. అదే జీవితంలో జరుగుతదని భావించడం సరికాదు. ప్రధానంగా కన్ను అదరడం.. దీనిపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. కన్ను అదిరితే లాభమా..? నష్టమా..? ఏ కన్ను అదిరితే ఎవరికి మంచిదనే వాదనలు ఉన్నాయి. అవేవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చాలా మందికి ఉన్నట్టుండి కన్ను అదురుతుంది. అంటే కన్ను నియంత్రణ కోల్పోయి తనంతటకు తాను అదురుతుంది. ఇలా కన్ను అదరడం కొన్నిసార్లు మంచిదని, మరికొన్నిసార్లు చెడుకు సంకేతంగా భావిస్తారు. దీని ఫలితం కూడా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఉంటుంది. కుడి కన్ను అదిరితే మగాళ్లకు, ఎడమ కన్ను అదిరితే మహిళలకు మంచిదని విశ్వసిస్తుంటారు. కన్ను అదరడానికి చాలా రకాల శాస్త్రీయ కారణాలను వివరించినా సరే ఈ నమ్మకం అలా కొనసాగుతూనే ఉంది. కన్ను అదిరేందుకు కళ్లు పొడిబారడం, కంటిలో అలెర్జీ, నీరసం, ఒత్తిడి, ఆల్కాహాల్ తీసుకోవడం వంటి లాజికల్ కారణాలు అనేకం ఉన్నాయి.
కన్ను అదరడానికి కారణాలు ఇవే..
– మెదడు లేదా నరాల లోపాల వల్ల కన్ను అదురుతుంది. అయితే, ఇది చాలా అరుదైన లక్షణం.
– చాలామందిలో అధిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మీ కన్ను అదురుతున్నట్లయితే మీరు వెంటనే ఒత్తిడిని దూరం చేసుకోడానికి ప్రయత్నించండి.
– ఎక్కువ సేపు టీవీ, మొబైల్ లేదా ల్యాప్టాప్లను చూసినా కళ్లు ఒత్తిడికి గురవ్వుతాయి. కాబట్టి.. మధ్య మధ్యలో మీరు కంటికి విశ్రాంతి ఇవ్వడం మంచిది.
– చాలామందిలో నిద్రలేమి వల్ల కూడా కళ్లు అదురుతాయి. మనిషికి కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం. కాబట్టి.. నిద్రను దూరం చేసుకుని కళ్లపై ఒత్తిడి పెంచకండి.
– కాఫీ లేదా చాక్లెట్లు ఎక్కువగా తినేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందట. కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకపోవడమే ఉత్తమం.
– ఒత్తిడి లేకుండా, బాగా నిద్రపోతూ.. కెఫీన్, మద్యానికి దూరంగా ఉండటం ద్వారా కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ కన్ను పదే పదే అదురుతుంటే.. మంచిదే అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.