శ్రమతో కూడిన విజయం ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం, ఒత్తిళ్లు పెరగవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. పొదుపును పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచిరోజు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది.
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల కారణంగా మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. సన్నిహితుల, శ్రేయోభిలాషుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు.
సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.
ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి రోజు కాదు. కోపాన్ని, మాటతీరును అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తమ రంగాల్లో తీరికలేని పనుల్లో నిమగ్నమై ఉంటారు. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొంటారు.
ఈ రోజంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ధన నష్టాలు సంభవిస్తాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై కూడా దృష్టి సారించలేకపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
గత కొంతకాలంగా వేధించిన ఆందోళనల నుంచి బయట పడతారు. పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు.
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నందున సహనంతో ఉండడం చాలా అవసరం. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండండి. కుటుంబంలో కలహపూరిత వాతావరణాన్ని నివారించడానికి మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మేష రాశి వారికి ఈ వారం గొప్ప శుభకరంగా ఉంటుంది. అదృష్టం గొప్ప అవకాశాలను అందిస్తుంది. ధన లాభం పొందవచ్చు. వృత్తి, వ్యాపార రంగాలలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. వారం చివరలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాల నుంచి ఆహ్వానం అందుతుంది.
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు గడప ఎక్కేముందు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడాల్సి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడానికి అదనపు శ్రమ, కృషి అవసరం. వ్యాపారస్తులకు వారం ప్రథమార్ధం అనుకూలించక పోయినా ద్వితీయార్ధంలో ఊహించని లాభాలు అందుకుంటారు.
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్నీ రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. కొత్త పనులు కష్టతరంగా ఉన్నప్పటికీ తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువు నుంచి దృష్టి మరల్చవచ్చు. కుటుంబ సమస్యలు మధ్యవర్తి ద్వారా పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాల కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు ఆదాయ వనరులు దెబ్బతినవచ్చు, వ్యాపారంలో పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. కుటుంబ సమస్యలతో మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతాయి. చేతిలో ఉన్న ప్రాజెక్టులు చేజారిపోవడం వల్ల విచారంగా ఉంటారు.
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. రాజకీయ నాయకులు ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. వారం రెండో భాగంలో, మీ ఆర్థిక విజయానికి వృత్తిలో పురోగతికి మార్గం సుగమం చేసే ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. ఎంతో కాలంగా భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు చేయాలనుకునేవారికి ఈ వారం కల నెరవేరుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.
కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సహోద్యోగులతో, సహచరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం వస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయం ఆశించినంతగా ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో జీవిత భాగస్వామి అండ ఉంటుంది.
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది. చాలా కాలంగా బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. వారం చివరలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రేయోభిలాషుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వ్యాపారులకు ఆదాయం పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరిగినప్పటికీ, ఊహించని లాభాలు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అంతర్జాతీయ వ్యాపారంలో వృత్తిని కొనసాగించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సమష్టి నిర్ణయాలతో మేలు జరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలోని ప్రత్యర్థులు మీ పురోగతిని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సమీప బంధువుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోకపోతే కలహాలు తప్పవు. వృత్తి నిపుణులు స్నేహితుల సహకారంతో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారు.
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారు లక్ష్య సాధన కోసం అదనపు శ్రమ, కృషి అవసరం. ఆర్ధికంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, నూతన ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. ప్రుభుత్వ పరంగా చేపట్టిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన సమస్యల గురించి చర్చిస్తారు. మిత్రుల సహాయంలో ఆర్ధిక పరంగా లాభదాయకమైన పథకంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది.
మకర రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభ కార్యాలు జరుగుతాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో ఆర్థిక లాభం, పురోగతి పుష్కలంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. పని ప్రదేశంలో సమస్యలు ఏర్పడవచ్చు.
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పరంగా పెండింగ్ లో ఉన్న నిధులు అందుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
మీన రాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు. సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అందిన శుభవార్తలతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల కారణంగా సంపద పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. పది మందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
ఈ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయం ఆశించిన రీతిలో ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన లాభం కలుగుతుంది. స్ధిరాస్తి సంభందిత ఒప్పందాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. తెలుగు మాసాంతమున కుటుంబ సంబంధ వ్యవహారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అంతగా అనుకూలించదు చేపట్టిన పనులలో ఊహించని ఎదురుదెబ్బలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు శారీరక శ్రమ పెరుగుతుంది. శిరో, నేత్ర సంబంధిత సమస్యలు మరింత బాధిస్తాయి. బంధుమిత్రుల తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. నిరుద్యోగులకు అనుకూలత ఉండదు. కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. మాసం చివరన సన్నిహితుల సహాయం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో జన్మరాశిలో వ్యయ స్థానంలో గ్రహ సంచారం వలన అనుకూలత ఉండదు. వృత్తి వ్యాపారాలు కొత్త సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికంగా మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చు ఆదాయానికి మించుతుంది. గృహంలో శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. ప్రయాణాలు ఉంటాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరగడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. సంతాన ప్రవర్తన కొంత ఆందోళనకు గురి చేస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాసాంతం లో వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో గ్రహ అనుకూలత వలన అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో జయం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నూతన గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు కొంత సత్ఫలితాలు ఇస్తాయి. సంతాన విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక అనుకూలతకలిగి దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు. మాసాంతంలో కొందరిని నమ్మి సహాయంచేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పూర్తిగానిపూర్తికాని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. రావలసిన బకాయిలువసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు తర్వాత కాలానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా సహాయ పడతారు. వ్యాపారాలలో మంచి ఆలోచన జ్ఞానం తో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో యందు అనుకూల గ్రహ సంచారం వలన వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక వివాదాలు నుండి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన విషయాలలో శుభవార్తలు అందుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నూతన పరిచయాలు వలన ఆర్ధికలాభాలు అందుతాయి. మాసం చివరలో ముఖ్యమైన పనుల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అంతగా అనుకూలించదు అష్టమ స్థానం లో గ్రహసంచారం వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉన్నది. చేసే ప్రతి పనిలో శారీరక శ్రమ అలసట కలుగుతాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక గృహ మార్పులు చేస్తారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా వృత్తి వ్యాపారాలలో చివరి వరకూ వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇంటాబయటా ప్రతికూలత పెరుగుతుంది. మాసం చివరన కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయాలలో కొంత ఉపశమనం కలుగుతుంది. సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా భయాందోళన కలుగుతాయి. ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగాలలో ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. చేసే ప్రతి పనికి వివాదాస్పదంగా ఉంటుంది. ధన వ్యవహారాలు అనుకూలించవు. శారీరక శ్రమ పెరుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలలో ఆర్ధిక పరమైన సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. కుటుంబ విషయాలలో ఆలోచనలు కలసిరావు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలలో లోపం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి మరింత కష్టపడాలి గృహనిర్మాణాలు మధ్యలో నిలిచిపోతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మరింత అభివృధి చెందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు గూర్చి గృహంలో చర్చలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. మాసం చివర శత్రు పరమైన సమస్యల వలన కొందరు చికాకులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో అన్ని విధాలా బాగుంటుంది. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో పెద్దలతో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలానాలు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మాసం చివరన స్త్రీ సంబంధిత సమస్యలు కలుగుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో మరింత అనుకూలంగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట మీ మాటకు ఎదురు ఉండదు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అవసరానికి చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మాసాంతమున అధికారులతో సమస్యలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఈ నెలలో కూడా అనుకూలిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో సౌఖ్యం కలుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మరింత సంతృప్తికర వాతావరణం ఉంటుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందులు కలగవు. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. మాసం చివరన జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ఆదాయం: 8 , వ్యయం:14 రాజపూజ్యం:4 , అవమానం:3 ఆత్మీయుల సహకారం తప్పనిసరి మే ప్రారంభం వరకు పనుల్లో జాప్యం వల్ల మనసులో ఆందోళన ఉంటుంది. మీకు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు. నిర్లక్ష్యం చేస్తే చిన్న పొరపాటు పెద్దది అవుతుంది. కుటుంబంలో విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అపనమ్మకాన్ని కలిగిస్తాయి. మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఆర్థిక కొరత ఉంది. ఆర్థిక పొదుపు పథకం అమలు చేయడం కష్టం. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే ఆర్థిక ప్రణాళికలు అమలు చేయబడతాయి. కుటుంబంలో మంగళ కార్యాలు జరుగుతాయి. కానీ ప్రతి పనికి ప్రియమైనవారి సహాయం మరియు సహకారం చాలా ముఖ్యం. ఉద్యోగంలో, మీ క్రింద పనిచేసే కార్మికవర్గం నుండి మీకు సహకారం లభిస్తుంది. ప్రజాసేవలో నిమగ్నమైన వారు ఉన్నత స్థితిని పొందుతారు. భూవివాదాలు ప్రయత్నంతోనే ముగిసిపోతాయి. మొత్తానికి ఏప్రిల్ నెల తర్వాత మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీరు కోపం తెచ్చుకోకుండా, తొందరపడకుండా, ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరించినంత మాత్రాన మంచి ఫలితాలు వస్తాయి.
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 7 అవమానం : 3 శుభ ఫలితాలు ఆశించవచ్చు శని, రాహువులు శుభ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మంచి ఫలితాలు ఆశించండి. అయితే బృహస్పతి అశుభ స్థానంలో ఉండటం వల్ల అనవసరమైన ఆటంకాలు, ఆందోళనలు ఉంటాయి. మే ప్రారంభం వరకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు కనిపిస్తాయి. మంచి సంపాదన ఉన్నా, సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం అనవసర విషయాలకే వెచ్చిస్తారు. హత బుద్ధి వల్ల కుటుంబంలో శాంతి, ప్రశాంతత లోపిస్తుంది. అన్ని సమస్యలకు మౌనమే పరిష్కారం. బంధువులతో సత్సంబంధాలు లేవు. ఉద్యోగంలో మీ శ్రమకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే దీని వల్ల వచ్చే లాభం మరొకరు పంచుకుంటారు. ఆత్మీయుల సహకారంతోనే శుభకార్యాలు జరుగుతాయి. సొంత ఇల్లు ఉన్నా వేరే చోట ఉండాల్సిందే. చిన్న చిన్న పనులకు కూడా చాలా శ్రమ అవసరం. కార్యాచరణ ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించండి.
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6 ఆదాయం బాగానే ఉన్నా ధన కొరత ఏర్పడుతుంది ఏప్రిల్ నెలాఖరు వరకు కుజుడు శుభప్రదంగా ఉంటాడు. రాహువు మధ్యస్థ వేగ ఫలితాలను ఇస్తాడు. అయితే శని కుంభరాశిలో ఉండటం వల్ల నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కొన్ని మతపరమైన ఆచారాలు పాటిస్తారు. మంచి ఆదాయం ఉన్నప్పటికీ డబ్బుకు కొరత ఉండవచ్చు. ఆరోగ్య పరంగా కోలుకోవడం నిదానంగా కనిపిస్తుంది. కుటుంబంలో పరస్పర సామరస్య స్వభావం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే పనిలో విజయం సాధించవచ్చు. మీ అధీనంలో ఉన్నవారు మీ జీవితాన్ని తయారు చేస్తారు. వారి సహాయ సహకారాలు లేకుండా ఏ పనీ జరగదు. వచ్చి మీ నుండి సహాయం పొందిన వారు మీకు దూరంగా ఉంటారు. అనుకున్న విధంగా ప్రయాణం చేయలేకపోతున్నారు. మంచి పని ప్రణాళిక ప్రయాణాలకు దారి తీస్తుంది. అయితే, సుదీర్ఘ పర్యటన సాధ్యం కాదు. తొందరపాటు ధనాన్ని ఖర్చు చేయడం వల్ల డబ్బు కొరత కనిపిస్తుంది. మీరు మొత్తం మీ జీవితానికి ఆర్కిటెక్ట్ అయి ఉండాలి. ఎవరి నుండి డబ్బు సహాయం ఆశించవద్దు.
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6 శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది మే 1 నుండి బృహస్పతి కటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కానీ శని మరియు రాహు గ్రహాలు అశుభ ఫలితాలను ఇస్తాయి. త్రికోణంలోని కేతువు శ్రమకు తగిన ఫలితాలను ఇస్తాడు. దీంతో గెలుపు కోసం పోరాడాల్సిన పరిస్థితి రావచ్చు. అనవసర ఖర్చుల వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. మంచి ఆదాయం ఉంటుంది. కానీ కాపాడే మనసు లేదు. కుటుంబం నుండి మంచి సహకారం లేదు. ఈ కారణంగా మీరు స్వయం కృషితో మాత్రమే పనిలో విజయం పొందుతారు. పనికిరాని పరుగు అనారోగ్యానికి దారి తీస్తుంది. మంచి సంపాదన ఉన్నప్పటికీ డబ్బుకు కొరత ఉంది. ఇరుగుపొరుగు వారితో పగ. ఇంట్లోని దుస్థితి నుంచి బయటపడేందుకు పవిత్ర స్థలాలను సందర్శించండి. మే నెల తర్వాత మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వాహనాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇనుము లేదా ఇతర లోహాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంక్రమణ గురించి హెచ్చరిక. అయినా కుటుంబ పెద్దల ఆరోగ్య పరంగా స్థిరత్వం లేదు.
ఆదాయం : 2 వ్యయం : 14 రాజ్యపూజ్యం:2 అవమానం : 2 డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏప్రిల్ నెలాఖరు వరకు బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తాడు. శని సప్తమంలో ఉన్నా ఇబ్బంది లేదు. కానీ పనులు నెమ్మదిగా సాగుతాయి. రాహు, కేతు గ్రహాలు అశుభ స్థానాల్లో సంచరిస్తున్నాయి. దీని వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆవేశంగా మాట్లాడటం వల్ల ఇబ్బందుల్లో పడతారు. అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. మంచి సహకారం వల్ల పనిలో విజయం లభిస్తుంది. కుటుంబంలో పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు ఎదుర్కొనే కష్టాలు తగ్గుతాయి. ఓర్పుతో మాత్రమే మీరు మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలను పొందుతారు. నిధుల కొరత లేదు. సీనియర్ అధికారులు అనవసరంగా చికాకు పెడుతున్నారు. మీరు లా పేపర్లో పాక్షికంగా మంచి ఫలితాలను పొందుతారు. చిన్న పిల్లలు తలకు గాయాలయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2 దూరపు బంధువుల సహకారం ఏప్రిల్ నెల వరకు గురుగ్రహం శుభ ఫలితాలను ఇవ్వదు. శని ఆరవ ఇంట్లో ఉన్నా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. లగ్నంలో కేతువు అశుభం అయితే సప్తమంలో రాహువు శుభం. కాబట్టి, ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, క్రమంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. సీనియర్ అధికారులతో మంచి అనుబంధం ఉంటుంది. ఇది మీ అంచనాలన్నీ నిజమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో దూరపు బంధువుల సహకారం వల్ల మంచి ఆదాయం ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండానే తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. మీరు అనవసరంగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకుంటారు. ఇది ఎదురుదెబ్బకు కారణం కావచ్చు. ప్రధాన పని పనులను జాగ్రత్తగా పూర్తి చేయండి. అనవసరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల సహాయం లేకుండా మీరు ఏ పనీ చేయలేరు. న్యాయ ప్రక్రియలో మాత్రమే మీరు సులభంగా విజయం సాధిస్తారు. పరస్పర చర్చలు దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక వివాదానికి తెరపడతాయి. మీరు ఇతరులను నిందించకుండా తెలివిగా మీ పనిని సాధిస్తారు.
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం:1 అవమానం : 5 అనవసర ఖర్చులు తగ్గించుకోండి బృహస్పతి ఏప్రిల్ చివరి వరకు సప్తమంలో సంచరిస్తుంది. ఈ కాలంలో మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఐదవ ఇంట్లో శని, ఆరవ ఇంట్లో రాహువు మంచి ఫలితాలను ఇస్తారు. కానీ కేతువు అనవసరమైన ఖర్చులను కలిగిస్తాడు. తొందరపాటు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మే ప్రారంభం వరకు మంచి ఆదాయం ఉంటుంది. అప్పుడు మీరు కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో కుజుడు పనిని వాయిదా వేస్తాడు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ మనసుకు తగిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులు మరియు స్నేహితులు గొప్ప సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయాణం అంటే బలమైన ప్రేమ. సొంత పనుల కోసం కదలికలు ఎక్కువవుతాయి. ఖర్చులు నిషిద్ధం కావచ్చు. మీరు కుటుంబంలోనే కాకుండా బయట సమాజంలో కూడా గౌరవప్రదమైన స్థితిని పొందుతారు. మీరు మీ మనస్సులోని చింతలను మరచిపోయి వ్యాపార వ్యవహారాలలో లాభాన్ని పొందుతారు. సన్నిహిత మిత్రుడు మీ విరోధిగా మారతాడు. ఎవరిని అంత తేలికగా నమ్మరు. సమయాభావం వల్ల సొంత పని సంస్థలు అసంపూర్తిగా ఉండవచ్చు.
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5 వివాదాలు పరిష్కారమవుతాయి, సహాయం అందుతుంది వృశ్చిక రాశి వారికి మే 1 నుండి బృహస్పతి మంచి స్థితిలో ఉండబోతున్నాడు. అప్పటి వరకు ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు క్షణంలో మాయమైపోతాయి. పిల్లల విషయంలో అనవసర గందరగోళం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మీ నిరీక్షణ తారుమారు అవుతుంది. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. వృద్ధుల సహాయం మరియు సహకారం కొత్త జీవితానికి నాంది అవుతుంది. మీరు ఇతరులచే సులభంగా ప్రభావితమవుతారు. అనవసరమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అనవసర మనస్పర్థలు తలెత్తుతాయి. మే తరువాత, మీరు చేయని శుభ కార్యాలను విజయవంతంగా నిర్వహిస్తారు. కుటుంబం మరియు సమాజంలో మీ మాటలకు ఎంతో గౌరవం లభిస్తుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మంచి అవకాశం లభిస్తుంది. మీది కాని తప్పుకు మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఆరోగ్య పరంగా క్రమంగా కోలుకుంటారు. రోజు గడిచే కొద్దీ ఉద్యోగంలో సమస్య తీరిపోతుంది. మీకు దూరంగా ఉన్న ఒక అధికారి తేడాను మరచి మీకు సహాయం చేస్తాడు.
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 7 అవమానం : 5 నిదానంగా పురోగతి ఉంటుంది కానీ ఒడిదుడుకులు తప్పవు ఏప్రిల్ నెల వరకు బృహస్పతి ఐదవ ఇంట్లో సంచరిస్తాడు. మూడవ ఇంట్లో శని బలవంతుడు. కానీ రాహు కేతువులు మాత్రమే మీకు అశుభ ఫలితాలను ఇస్తారు. మీరు ఏప్రిల్ నెల వరకు చేపట్టిన పనులన్నింటిలో సులభంగా విజయం సాధిస్తారు. మే 1వ తేదీ నుండి బృహస్పతి అశుభం, ఎదురుదెబ్బలు తప్పవు. అయితే ప్రతి పనికి కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అవసరం. నిరంతరం శ్రమించినా పనులు నెమ్మదిగా సాగాయి. కుటుంబంలో అందరి ఆరోగ్యం కోలుకుంటుంది. తీసుకున్న తీర్మానాలను అనవసరంగా మార్చుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవు. స్నేహితులు, సన్నిహితుల నుంచి ప్రతి విషయంలోనూ మంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. శని శక్తిమంతుడు మరియు ఏ పనిలోనైనా విజయం సాధించే వరకు విశ్రమించడు. వ్యక్తిగత అవసరాల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అందరితో కలిసి యాత్రా ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లండి. పిల్లలతో మనస్పర్థలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. మీరు ఒప్పించే ప్రసంగం ద్వారా మీకు ఇష్టమైన పని కార్యకలాపాలలో విజయం సాధిస్తారు.
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1 చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కానున్నాయి బృహస్పతి నాల్గవ ఇంట్లో సంచరిస్తున్నాడు. సెకండాఫ్లో శని శక్తిమంతుడు. మూడవ ఇంట్లో రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు. కానీ కేతువు పనిలో నిర్దిష్ట స్థాయి ఫలితాలను అనుమతించడు. అయినా సమస్య లేదు. మే 1వ తేదీన బృహస్పతి పంచమ భవలోకి ప్రవేశించిన తర్వాత అన్ని రకాల అనుకూలతలు కనిపిస్తాయి. మీరు గెలవాలనే కోరికతో కొనసాగుతారు. కానీ అతి విశ్వాసం తప్పులకు దారి తీస్తుంది. కాబట్టి శాంతి మరియు సంయమనంతో వ్యవహరించడం ముఖ్యం. అసంపూర్తిగా ఉన్న పనులను సులభంగా పూర్తి చేయండి. ఉద్యోగంలో ఆశించిన విధంగా గౌరవప్రదమైన స్థితిని పొందుతారు. ఖర్చులు క్రమంగా తగ్గుతాయి. దీర్ఘకాలంగా సాగుతున్న పనులు పూర్తవుతాయి. కానీ తండ్రి ఆదాయంలో సమస్య ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. మీరు మతపరమైన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే అరుదైన అవకాశం లభిస్తుంది. అజాగ్రత్తగా నడిస్తే పనిలో ఇబ్బంది కలుగుతుంది.
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1 సహాయం చేయడానికి వచ్చే వారిని అనుమానించకండి శని మీ స్వంత రాశిలో ఉన్నా ఎటువంటి ఇబ్బంది కలిగించడు. రాహువు ద్వితీయంలో ఉన్నా సమస్య ఉండకూడదు. అయితే మాట మీద నియంత్రణ ఉండాలి. బృహస్పతి తృతీయలో ఉన్నాడు మరియు మే 1వ తేదీన చతుర్థ భావంలో సంచరించడం ప్రారంభిస్తాడు. అయితే 8వ ఇంట్లో ఉన్న కేతువు చిన్నపాటి ఇబ్బందులను కలిగిస్తుంది. మనసు విప్పి భావాలను పంచుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. మీకు సహాయం చేయడానికి వచ్చిన వారిని అనుమానంతో చూస్తారు. అందరితో ప్రేమలో నమ్మకం ఉంటే అది అసాధ్యం అనే ఆలోచన లేదు. బంధువులతో అనవసర వాదనలకు దిగుతారు. ఆరోగ్యం పరంగా సమస్యలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో మంచి ఆదాయం ఉంటుంది. కానీ మీరు డబ్బు ఆదా చేయడంలో విఫలమవుతారు. ఉద్యోగంలో అనవసర మార్పుల వల్ల ఉద్యోగం మారతారు. విద్యార్థులు బాగా రాణించగలరు. మాటలతో అందరి మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లవచ్చు. అబద్ధాలు చెప్పే వ్యక్తులకు దూరంగా ఉండండి.
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం :2 అవమానం :4 ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలం బృహస్పతి రెండవ కోణంలో చివరి వరకు సంచరిస్తుంది. కాబట్టి మీ మాటకు మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థిక సమస్య లేదు. మేలో బృహస్పతి ద్వితీభవంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి చిన్న ఆలోచనలకు కూడా చాలా శ్రమ అవసరం. రాహువు రాశిలోనే ఉన్నందున, మీరు ప్రతి సమస్యకు మానసిక ఒత్తిడికి గురవుతారు. శని ద్వాదశ భావంలో ఉండడం వల్ల అనవసర ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. పని కార్యకలాపాలలో మెరుగైన ప్రయత్నం మంచి ఫలితాలకు దారి తీస్తుంది. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో మాత్రమే విజయం సాధించవచ్చు. సోదరుడు లేదా సోదరి సహాయంతో, మీరు రుణ విముక్తి పొందుతారు. మీరు ప్రియమైనవారి సహాయంతో పనిలో విజయం సాధిస్తారు. అనవసర సంచారం నీరసం. ఇంట్లో శుభ కార్యాలు జరగాలంటే ధైర్యం పెంచుకోవాలి. మొత్తం ఫలితాలు మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఇంటిలోని స్త్రీల ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు ఉండవచ్చు.