Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారికి మెండుగా ఆర్థిక లాభాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారు ఈ రోజంతా శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక నష్టాలు కలిగే సూచన ఉంది. ప్రియమైన వారికి మధ్య విబేధాలు తలెత్తవచ్చు. కుటుంబ వాతావరణం అనిశ్చితిగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారాలలో మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. నూతన ఆదాయ వనరులు సమకూరుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆశించిన లాభాలు అందుకుంటారు. అవసరానికి సరిపడా ధనం సమకూరుతుంది. భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణంలో పురోగతి ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరగవచ్చు. వ్యాపారులు ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రంగా శ్రమించాలి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉత్సాహంగా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య లాభం ఉంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలతో ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, సవాళ్లు చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో నిర్లక్ష్యం తగదు. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో సహనం విడిచి పెట్టద్దు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కోపావేశాలు తగ్గించుకోవాలి. అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో చక్కని పురోగతి ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అనేక మార్గాల నుంచి ధనలాభాలు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.