శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ల‌క్ష్మీదేవి క‌టాక్షంతో ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ల‌క్ష్మీదేవి క‌టాక్షంతో ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీ గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉంది. ఉద్యోగులు పట్టుదలతో, తమ స్వయంకృషితో అభివృద్ధి సాధిస్తారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు విశేషంగా కలిసి వస్తుంది. విశేషమైన ఆర్థిక లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. లక్ష్మీకటాక్షంతో మీరు పట్టింది బంగారం అవుతుంది. నూతన గృహ యోగం, వాహన యోగాలున్నాయి. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే అన్నింటా విజయం ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం సామాన్యంగానే ఉంటుంది. వృథా ఖర్చులు నివారించండి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. అనుకున్న పనులు నెరవేరడంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సామరస్యంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక వార్త విచారం కలిగిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే ఇంటా బయట శుభ ఫలితాలు సాధిస్తారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ముందు చూపుతో ఉండడం మంచిది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఖర్చులు అదుపు చేయండి.