Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు వివాహం నిశ్చయం..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పేరొందిన గొప్ప వ్యక్తులతో సమావేశం అవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అలసత్వం తగదు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. కొత్త పరిచయాలు, స్నేహాలు వలన వృత్తికి ప్రయోజనం ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశముంది. విశేషమైన ఆర్ధిక ప్రయోజనాలుంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరుల సహకారంతో మేలు జరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం, ఒత్తిడి పెరగవచ్చు. అధికారులతో వినయపూర్వకంగా నడుచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ప్రయోజనాలు సాధిస్తారు. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు గొప్ప శుభవార్తలు వింటారు. అదృష్టం వరించి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మీకటాక్షం ఉంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ప్రయత్నంతోనే వేగంగా ఫలితాలు అందుకుంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో తొందరపాటుతో ప్రవర్తిస్తే నష్టపోతారు. వివాదాలకు దూరంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఏర్పడిన ఆటంకాలను మనోబలంతో అధిగమిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. స్వయంకృషితో లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. ఆస్తులు వృద్ధి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. కొంతకాలంగా వేధించిన సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం తప్పనిసరి. కుటుంబంలో ఉద్రిక్త వాతావరణాన్ని నివారించడానికి మీ మాటలను అదుపులో పెట్టుకోని కోపాన్ని దూరం చేయండి.