Vastu Tips | మీ పాత బ‌ట్ట‌ల‌ను దానం చేస్తున్నారా..? జ‌ర జాగ్ర‌త్త‌..!

Vastu Tips | దాన గుణం చాలా గొప్ప‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. కొంద‌రు అన్న‌దానం, ఇంకొంద‌రు వ‌స్త్ర దానం( Cloth Donation ), మ‌రికొంద‌రు భూదానం చేస్తుంటారు. వీటిలో దేనిక‌దే గొప్ప‌ది.

Vastu Tips | మీ పాత బ‌ట్ట‌ల‌ను దానం చేస్తున్నారా..? జ‌ర జాగ్ర‌త్త‌..!

Vastu Tips | దాన గుణం చాలా గొప్ప‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. కొంద‌రు అన్న‌దానం, ఇంకొంద‌రు వ‌స్త్ర దానం( Cloth Donation ), మ‌రికొంద‌రు భూదానం చేస్తుంటారు. వీటిలో దేనిక‌దే గొప్ప‌ది. అన్న‌దానంతో క‌డుపు నింప‌డం, భూదానంతో ఆర్థిక భ‌రోసా ఇవ్వ‌డం, వ‌స్త్ర దానంతో గౌర‌వంగా బ‌తికేలా చేస్తాయి. అయితే వ‌స్త్ర దానం చాలా మంది చేస్తుంటారు. ఈ వ‌స్త్ర దానానికి వాస్తు నియమాలు ఉన్నాయి. ఈ వాస్తు నియ‌మాలు( Vastu Tips ) త‌ప్ప‌క పాటించాల‌ని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చ‌రిస్తున్నారు. బ‌ట్ట‌లు( Clothes ) దానం చేసేట‌ప్పుడు ఎలాంటి నియ‌మాలు పాటించాలో తెలుసుకుందాం.

ఈ నియ‌మాలు పాటించాల్సిందే..

వాస్తు శాస్త్రం ప్రకారం.. బట్టలకు శక్తిని గ్రహించే తత్త్వం కూడా ఉంది. అప్పటి వరకూ దుస్తులు ధరించిన వ్యక్తి.. శక్తి, భావోద్వేగాలు, అనుభవాలు.. దానం చేసిన వారికి కూడా చూపుతుంది. మీ బట్టలు దానం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరు దుస్తులు దానం చేసేటప్పుడు చిరిగిపోయినవి, పనికి రానివి కాకుండా కాస్త మంచిగా ఉన్నవి మాత్రమే దానం చేయాలి. మీరు దానం చేసేటప్పుడు ఉప్పు నీటిలో ముంచి ఆరేసి ఇవ్వాలి. అలాగే మీరు దానం చేసిన తర్వాత ఎదుటి వ్యక్తిని కనీసం రూపాయి అయినా అడిగి తీసుకోవాలి. అలాగే గురువారం పూట బట్టలు దానం చేస్తే మంచిది.

ఎదుటి వారికి సహాయం చేయాలి అనుకున్నప్పుడు మీరు పాత దుస్తులు కాకుండా కొత్త దుస్తులు కొన్ని ఇచ్చేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా చలి కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో స్వెటర్లు, దుప్పట్లు, రగ్గులు వంటివి కొని ఇవ్వడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం జాతకంలో కుజదోషం పోతుందని పండితులు చెబుతారు. అంతే కాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందట.