Sleeping Together | జీవిత భాగస్వామితో కలిసి నిద్రిస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?
Sleeping Together | మీకు ఈ హెడ్డింగ్ చదవగానే ఒక డౌట్ రావొచ్చు. అదేంటంటే.. భార్యాభర్తలు కలిసే నిద్రిస్తారు. ఇదేం రాతలు అనుకోవచ్చు. చాలా మంది భార్యాభర్తలు.. తమకు పిల్లలు కలిగిన తర్వాత చాలా వరకు దూరంగా ఉంటారు. వారు ఏకాంతంగా గడిపే సమయం చాలా తక్కువే అని చెప్పొచ్చు. అయితే ప్రతి రోజు జీవిత భాగస్వామితో బెడ్ షేర్ చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి […]

Sleeping Together | మీకు ఈ హెడ్డింగ్ చదవగానే ఒక డౌట్ రావొచ్చు. అదేంటంటే.. భార్యాభర్తలు కలిసే నిద్రిస్తారు. ఇదేం రాతలు అనుకోవచ్చు. చాలా మంది భార్యాభర్తలు.. తమకు పిల్లలు కలిగిన తర్వాత చాలా వరకు దూరంగా ఉంటారు. వారు ఏకాంతంగా గడిపే సమయం చాలా తక్కువే అని చెప్పొచ్చు. అయితే ప్రతి రోజు జీవిత భాగస్వామితో బెడ్ షేర్ చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒంటరిగా నిద్రించే వారి కంటే జీవిత భాగస్వామితో నిద్రించే వారు అనేక లాభాలను పొందుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది.
లాభాలు ఏంటో తెలుసుకుందాం..
- జీవిత భాగస్వామితో కలిసి నిద్రించే వారికి నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందుతారు.
- అధిక సమయం నిద్రిస్తారు. అంతేకాదు పడుకోగానే నిద్ర పడుతుంది.
- భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. దీంతో బంధం బలపడుతుంది.
- భార్యాభర్తలు కలిసి నిద్రించడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై.. శృంగార సంబంధాలను ప్రోత్సహిస్తుంది.
- దీని వల్ల భార్యాభర్తలు అనుభూతిని పొందడమే కాకుండా, ఒత్తిడికి దూరంగా ఉంటారు.
- భాగస్వామి వెచ్చదనం సౌకర్యవంతంగా అనిపిస్తుంది.
- ఫలితంగా ఇద్దరి మధ్య మరింత ప్రేమ చిగురిస్తుంది.
- ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి సరైన ఏకాంత సమయం ఇదే.
- ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు ఉండవు.
- ఫలితంగా భార్యాభర్తల దినచర్య కూడా సాఫీగా సాగిపోతుంది.