ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బెల్లానికి దూరంగా ఉండాల్సిందే..!

బెల్లం ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. బెల్లంలో ఐర‌న్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఎముక‌ల దృఢంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది

  • By: Somu    health    Mar 28, 2024 12:29 PM IST
ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బెల్లానికి దూరంగా ఉండాల్సిందే..!

బెల్లం ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. బెల్లంలో ఐర‌న్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఎముక‌ల దృఢంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. అయితే కొంద‌రు మాత్రం బెల్లానికి దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు. మ‌ధుమేహ వ్య‌ధిగ్ర‌స్తులు బెల్లం ఎక్కువ తీసుకోవ‌ద్దంటున్నారు. ఎందుకంటే ప‌ది గ్రాముల బెల్లంలో దాదాపు 9.7 శాతం చెక్క‌ర ఉంటుంద‌ని దీనివ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా బెల్లానికి వీలైనంత దూరంగా ఉండాలంట‌, వంద గ్రాముల బెల్లంలో 385 కేల‌రీలు ఉంటాయంట ఇది బ‌రువు పెరిగేందుకు ఉప‌యోగ ప‌డుతుంద‌ట‌.

కీళ్ల నొప్పులతో బాధ‌ప‌డుతున్న వారు కూడా బెల్లాన్ని త‌క్కువ‌గా తీసుకోవ‌డం మంచిదంటున్నారు. బెల్లం ఎక్కువ‌గా తీసుకోవ‌డం మూలంగా నొప్పులు పెరుగుతాయ‌ని, వాపులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. బెల్లం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, మ‌ల‌బ‌ద్ధ‌కం ఉన్న‌వారు కూడా కాస్త దూరంగా ఉండాలంటున్నారు. ఎండ‌కాలంలో బెల్లం ఎక్కువ‌గా తీసుకోవ‌డం వల‌న ముక్కు నుంచి ర‌క్త‌శ్రావం జ‌రుగుతుందంటున్నారు. ఏదేమైనా పోష‌కాలు మెండుగా ఉన్న బెల్లాన్ని త‌క్కువ మోతాదులో తీసుకుంటే ఏలాంటి ప్ర‌మాదం ఉండ‌ద‌ని నిపుణులు తెలుపుతున్నారు.