మీరు మ‌ల‌బద్దకంతో బాధ‌ ప‌డుతున్నారా..? అయితే ఈ ఆహారం తీసుకోండి..

Health Tips | విధాత: మీరు మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ ఆహార నియ‌మాలు పాటించాల్సిందే. లేదంటే అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. పీచు అధికంగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించొచ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్ర‌తి రోజు వ్యాయామం చేయ‌డంతో కూడా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌పడొచ్చ‌ని సూచిస్తున్నారు. ఫైబ‌ర్(పీచు) అధికంగా ఉండే పండ్లు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, ఓట్స్ తో కూడిన ఆహారం నిత్యం తీసుకుంటే ఆహారం […]

మీరు మ‌ల‌బద్దకంతో బాధ‌ ప‌డుతున్నారా..? అయితే ఈ ఆహారం తీసుకోండి..

Health Tips | విధాత: మీరు మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ ఆహార నియ‌మాలు పాటించాల్సిందే. లేదంటే అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. పీచు అధికంగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించొచ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ప్ర‌తి రోజు వ్యాయామం చేయ‌డంతో కూడా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌పడొచ్చ‌ని సూచిస్తున్నారు. ఫైబ‌ర్(పీచు) అధికంగా ఉండే పండ్లు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, ఓట్స్ తో కూడిన ఆహారం నిత్యం తీసుకుంటే ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతోంది.

ఫైబ‌ర్ అధిక మోతాదులో ఉండే ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల‌.. మ‌ల‌బ‌ద్దకాన్ని నివారించ‌డ‌మే కాకుండా, పేగుల‌ను బ‌లంగా, ఆరోగ్యంగా ఉంచుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి తోడు రోజూ త‌గినంత నీరు తీసుకుంటే కూడా జీవ‌క్రియ‌ల వేగం పెరుగుతుంది. ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అయ్యేందుకు తోడ్పాటును అందిస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చు.

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు పెరుగు, మ‌జ్జిగ వంటి ప్రొబ‌యాటిక్స్ అధికంగా తీసుకోవ‌చ్చు. కాఫీ, టీల‌ను త‌గ్గించాలి. ఈ రెండు అధికంగా తీసుకుంటే ఇందులో ఉండే కెఫిన్‌ డీహైడ్రేషన్‌కు దారితీసి అవయవాలపై ఒత్తిడి పెంచుతుంది. జీర్ణ సమస్యలు, గ్యాస్‌ పేరుకుపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.