Chicken Soup | చికెన్ సూప్‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో..? సీజ‌న‌ల్ వ్యాధుల‌కు చ‌క్క‌టి ఔష‌ధం కూడా..!!

hicken Soup | ఎండాకాలం అయిపోయింది. వానాకాలం వ‌చ్చేసంది. వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక వాతావ‌ర‌ణం మార‌డంతో అనేక రోగాలు వెంటాడుతుంటాయి. జ‌లుబు( Cold ), ద‌గ్గు( Cough ), చ‌లిజ్వ‌రం( Fever ) వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. ఇలాంటి స‌మ‌యంలో శ‌రీరానికి రోగ నిరోధ‌క శ‌క్తి( Immunity )  చాలా అవ‌స‌రం.

  • By: raj    health    Jun 23, 2024 7:44 AM IST
Chicken Soup | చికెన్ సూప్‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో..? సీజ‌న‌ల్ వ్యాధుల‌కు చ‌క్క‌టి ఔష‌ధం కూడా..!!

Chicken Soup | ఎండాకాలం అయిపోయింది. వానాకాలం వ‌చ్చేసంది. వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక వాతావ‌ర‌ణం మార‌డంతో అనేక రోగాలు వెంటాడుతుంటాయి. జ‌లుబు( Cold ), ద‌గ్గు( Cough ), చ‌లిజ్వ‌రం( Fever ) వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. ఇలాంటి స‌మ‌యంలో శ‌రీరానికి రోగ నిరోధ‌క శ‌క్తి( Immunity )  చాలా అవ‌స‌రం. అందుకు బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తీసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తిని ఇచ్చే పోషకాలు మన శరీరానికి అవసరం. ఒకవైపు శక్తిని ఇస్తూనే, మరోవైపు బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే సత్తువను కూడా వ్యాధినిరోధక వ్యవస్థకు ఇవ్వాలి. అలాంటి వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు… అంటే వానాకాలంలో, శీతాకాలంలో సాయంత్రం పూట చికెన్ సూప్( Chicken Soup ) తాగితే మంచిది. శరీరానికి శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మ‌రి చికెన్ సూప్ ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.

చికెన్ సూప్ త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు..

బోన్‌లెస్ చికెన్ – పావు కిలో
పాల‌కూర – త‌గినంత‌
ఉల్లికాడలు – రెండు
బీన్స్ – మూడు
వెల్లుల్లి రెబ్బలు – మూడు
క్యారెట్ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కార్న్ ఫ్లోర్ – అర స్పూను
నూనె – ఒక స్పూను
మిరియాల పొడి – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా

చికెన్ సూప్ త‌యారీ విధానం ఇలా..

మొద‌ట‌గా బోన్‌లెస్‌ చికెన్‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత‌ నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. ఇక స్ట‌వ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు, చికెన్ వేసి బాగా ఉడికించాలి. చికెన్ ఉడికిన త‌ర్వాత కింద‌కు దించాలి. అనంత‌రం మ‌రో పాత్ర‌లో నూనె వేసి మ‌రిగించాలి. తరిగిన క్యారెట్, బీన్స్, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత గిన్నెలోని చికెన్ ముక్కలను తీసి ఆ పాత్ర‌లో వేసి వేయించాలి. ఉప్పు, పాలకూర తరుగు, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలపాలి. ఓ పది నిమిషాలు అలా ఉడికించాక చికెన్‌ను ఉడికించిన నీటిని కూడా వేసేయాలి. దీన్ని వేడిగానే ఉన్నప్పుడు తాగాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పిల్లల చేత కూడా ఈ సూపును తాగించడం చాలా ముఖ్యం. ముసలి వారికి కూడా ఈ సూప్ నచ్చుతుంది.

గొంతు నొప్పికి మంచి ఉప‌శ‌మ‌నం..

గొంతు నొప్పి వేధిస్తున్నప్పుడు చికెన్ సూప్ తాగాలి. ఇది మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. టీ, కాఫీలు మానేసి చికెన్ సూప్ ప్రయత్నించండి. సూప్ తాగుతూ ఉంటే గొంతులో హాయిగా అనిపిస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. చికెన్ నూనెలో వేయించి తినేకన్నా, ఇలా నీటిలో ఉడికించి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది చాలా సులువుగా జీర్ణం అవుతుంది. ఇలా చికెన్ సూప్ తాగడం వల్ల బరువు కూడా పెరగరు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. పొట్ట నిండిన భావనను అందిస్తుంది. దీనిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.