మనిషి జీవితంలో ముప్పావు వంతు నిద్ర పోవాలట!.. లేదంటే అంతే సంగతి!
మనిషి సహజంగా ముప్పావు వంతు జీవితాన్ని నిద్రకు కేటాయిస్తాడట.. అయితే ప్రస్థుత జీవన శైలిలో అది సాద్యపడటం కాస్త కష్టమనే చెప్పవచ్చు

విధాత: మనిషి సహజంగా ముప్పావు వంతు జీవితాన్ని నిద్రకు కేటాయిస్తాడట.. అయితే ప్రస్థుత జీవన శైలిలో అది సాద్యపడటం కాస్త కష్టమనే చెప్పవచ్చు. రోజు వారి పనుల ఒత్తిడి మూలంగానో, లేదా నైట్ షిఫ్టుల వలనో వేరే ఇతర కారణాల వలన మన శరీరానికి తగినంత నిద్రను ఇవ్వలేక పోతున్నాము. దీని మూలంగా పలు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నామంటున్నారు నిపుణులు. అయితే పెద్దలుకు 5 గంటల నిద్ర సరిపోతుందన్న వాదన పూర్తిగా విరుద్దమంటున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనంటున్నారు.
ఇలా చేయడం వలన గుండెకు సంబంధించిన వ్యాదుల భారిన పడతారంటున్నారు. పెద్దలు తప్పకుండా 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సెంటర్స్ ఫర్ కంట్రోల్ డిసీజ్ వెల్లడిస్తోంది. మనలో కొందరు ప్రయాణ సమయాల్లో, పగటి పూట ఖాళీ సమయాల్లో కునుకు వేసి 8 గంటల నిద్రను పూర్తి చేశామనుకుంటున్నారు. కానీ అలా చేయడం వలన డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాదులు వస్తాయంటున్నారు. అందుకే నిద్రకంటూ ప్రత్యేక సమయం కేటాయించాలని, అది రాత్రి పూట నియమించు కోవడం మంచిదంటున్నారు. రాత్రిళ్లు 8 గంటలతో పాటు పగటి పూట కూడా కునుకు వేయడం మంచిదని నిద్ర నిపుణులు వెల్లడిస్తున్నారు.