సూపర్ స్పెషాలిటీ దవాఖానలను పటిష్టంగా నిర్మించాలి: సీఎం కేసీఆర్
విధాత: రోడ్లు భవనాల శాఖ ఆధర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానలను పటిష్టంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం వరంగల్ హైద్రాబాద్‌లలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో ఈఎన్టీ, డెంటల్, ఆప్తమాలజీ విభాగాల కోసం ఒక ఫ్లోర్ ను కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం దవాఖానాల నిర్మాణాల నమూనాలను పరిశీలించారు. ఎత్తయిన అంతస్తులతో అన్ని విభాగాలకు ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టాలన్నారు. సూచించిన విధంగా నమూనాలను రూపొందించుకుని […]

విధాత: రోడ్లు భవనాల శాఖ ఆధర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానలను పటిష్టంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం వరంగల్ హైద్రాబాద్‌లలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో ఈఎన్టీ, డెంటల్, ఆప్తమాలజీ విభాగాల కోసం ఒక ఫ్లోర్ ను కేటాయించాలని సూచించారు.
ఈ సందర్భంగా సీఎం దవాఖానాల నిర్మాణాల నమూనాలను పరిశీలించారు. ఎత్తయిన అంతస్తులతో అన్ని విభాగాలకు ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టాలన్నారు. సూచించిన విధంగా నమూనాలను రూపొందించుకుని రావాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించారు.
నూతన దవాఖానాలను అటు మెడికల్ విద్యార్థులకు ఇటు ప్రజల వైద్య సేవలకు అనుగుణంగా నిర్మించాలన్నారు. కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానా ఉండాలని అన్నారు.