Brahmi Muhurtam I ‘బ్రాహ్మీ ముహూర్తం’ అంటే ఏమిటి? ఆ స‌మ‌యంలో నిద్రలేస్తే…?

బ్రాహ్మీ ముహూర్తం..!! ఈ పదాన్ని ప్ర‌తి ఒక్క‌రూ త‌ర‌చూ వినే ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు? ఆ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? అస‌లు ఆ స‌మ‌యంలో ఎందుకు నిద్రలేవాలి ? లేస్తే ఏమి జ‌రుగుతుంది? తెలుసుకుందాం.. Brahmi Muhurtam l బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్ల‌వారుజామున సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మ‌రోలా చెప్పాలంటే రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి […]

Brahmi Muhurtam I ‘బ్రాహ్మీ ముహూర్తం’ అంటే ఏమిటి? ఆ స‌మ‌యంలో నిద్రలేస్తే…?

బ్రాహ్మీ ముహూర్తం..!! ఈ పదాన్ని ప్ర‌తి ఒక్క‌రూ త‌ర‌చూ వినే ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు? ఆ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? అస‌లు ఆ స‌మ‌యంలో ఎందుకు నిద్రలేవాలి ? లేస్తే ఏమి జ‌రుగుతుంది? తెలుసుకుందాం..

Brahmi Muhurtam l బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్ల‌వారుజామున సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మ‌రోలా చెప్పాలంటే రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రాహ్మీ ముహూర్తం అంటారు.

పూజలు, జపాలు, మంత్ర సాధన చేసేవారికి బ్రాహ్మీ ముహూర్తం విశిష్టమైన సమయంగా చెబుతారు. అంతేకాదు చ‌దువుకునే విద్యార్థులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని చెప్తారు. ఎందుకంటే రాత్రంతా విశ్రాంతి తీసుకొని ఉంటున్నందున శ‌రీరం తేలిక‌గా.. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది.

ఆ స్థితిలో ఏ ప‌ని చేసినా శ్రద్ధాస‌క్తులు మెండుగా ఉంటాయి. దీనికి తోడు ప్ర‌కృతి కూడా త‌న‌వంతుగా నిశ్శ‌బ్దంగా, ప‌రిశుభ్ర‌మైన గాలిని అందిస్తూ మ‌న‌కు స‌హ‌క‌రిస్తుంది. చేసే ప‌నిలో విజ‌యం సాధించాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సాధ‌న చేయాలి.. అప్ప‌డు విజ‌యం త‌థ్యం..

మన శరీరంలో ఉండే జీవ గడియారాన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రాహ్మీ ముహూర్తంలో చ‌దువును కొన‌సాగిస్తే చక్కగా గుర్తుంటుంది. స‌త్ఫ‌లితాలు సాధిస్తారు.

ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రూ రోజంతా ఒత్తిడులు, ఆందోళ‌న‌ల‌తోనే గ‌డిపేస్తున్నారు. అవ‌న్నీ మ‌ర‌చిపోయి రాత్రి స‌మ‌యాన నిద్రలోకి జారుకుంటాం. దీంతో మెద‌డుకి విశ్రాంతి ల‌భించి నూత‌నుత్తేజంతో పొద్దున్నే మేల్కొంటాం. ఆ ఉత్తేజం రెట్టింపు కావాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి.

ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వ‌ర‌గా నిద్ర‌కు ఉప‌క్ర‌మించి, ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు ద‌రిచేర‌వు. ఎందుకంటే రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్‌కు వెళ్లేవారికి ఇది మ‌రింత‌ ఉపయెాగ పడుతుంది.

నేడు చాలా మంది మ‌హిళ‌లు ఇంటి ప‌ని, వంట ప‌ని, పిల్లల‌ను త‌యారు చేయ‌డం ఆత‌ర్వాత ఉద్యోగ నిర్వ‌హణ బాధ్య‌తల‌తో స‌త‌మ‌త‌మవుతుంటారు. మ‌రి అలాంటి వారు పొద్దు పోయాక ఎప్పుడో లేస్తే ఉరుకులు పరుగుల‌తో ప‌నులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

స‌మ‌యానికి ప‌నులు పూర్తి కాక‌పోతే చిరాకు, కోపం, ఆవేశంతో ర‌గిలి పోతుంటారు. అదే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో అన్ని ప‌నులు ప్ర‌శాంత చిత్తంతో అల‌స‌ట లేకుండా కూల్‌గా పూర్తి చేసుకునే వీలుంటుంది. దీంతో ఇంటి వాతావ‌ర‌ణం కూడా ఆనంద‌మ‌యం అవుతుంది.

ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి.

దీంతో సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి మ‌న శ‌రీరం గ్ర‌హించి ఎముకల బలానికి సహాయపడుతుంది. అంతేకాదు రోజుల శిశువును ఉద‌యం స‌మ‌యంలో ఎండ‌కు ఉంచాల‌ని డాక్ట‌ర్లు చెప్తున్న విష‌యం తెలిసిందే క‌దా.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం రేప‌టి నుంచి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి.. అనుకున్న ప‌నుల‌ను స‌కాలంలో సాధించి విజ‌య‌గ‌ర్వంతో జీవితాన్ని ఆనంద‌మయం చేసుకోండి…