Diamond | వందేళ్లలో ఇదే పెద్ద డైమండ్.. బోట్స్‌వాన గనిలో లభ్యం
బోట్స్‌వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు అని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. దీనిని ఎక్స్-రే టెక్నాలజీ సహాయంతో గుర్తించినట్లు కెనడియన్ మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది.

diamond | బోట్స్‌వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు అని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. దీనిని ఎక్స్-రే టెక్నాలజీ సహాయంతో గుర్తించినట్లు కెనడియన్ మైనింగ్ (Canadian company) కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ (Lucara Diamond Corp) తెలిపింది. ఇది అత్యధిక నాణ్యత కలిగిన వజ్రం అని వివరించింది. గత వందేళ్ళలో లభించిన అతిపెద్ద డైమండ్ ఇదే కావడం విశేషం. ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాలన్నీ ఇక్కడ దొరికినవే కావడం విశేషం.
దక్షిణాఫ్రికాలో 1905లో 3,106 క్యారెట్ల కలినన్ వజ్రం దొరికిందని, ఆ తర్వాత దొరికిన అతి పెద్ద వజ్రం ఇదేనని పేర్కొంది. కలినన్ వజ్రాన్ని జెమ్స్‌గా ముక్కలు చేశారని, వీటిలో కొన్ని జెమ్స్ బ్రిటిష్ క్రౌన్ ఆభరణా (British jeweller)ల్లో ఉన్నాయని తెలిపింది. కాగా వజ్రాలు అధికంగా దొరికే దేశాల్లో బోట్స్‌వానా రెండోది.కరోవే గనిలో 2019లో దొరికిన 1,758 క్యారట్ల సెవెలో వజ్రం ఇప్పటి వరకు రెండో అతి పెద్ద వజ్రంగా రికార్డుల్లో ఉండేది. దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ లూయిస్ వుయిట్టన్ కొనుగోలు చేసింది.