వాట్సాప్‌ నయా ఫీచర్‌.. యూజర్ల ప్రైవసీకి యూజర్‌ నేమ్‌..!

వాట్సాప్‌ నయా ఫీచర్‌.. యూజర్ల ప్రైవసీకి యూజర్‌ నేమ్‌..!

విధాత‌: ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌కు పరిచయం చేస్తుంటుంది. తాజాగా మరో ఫీచర్స్‌ను తీసుకురాబోతున్నది. యూజర్లకు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను కాన్ఫిగర్‌ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేయబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై పని చేస్తున్నది. ట్రయల్స్‌ విజయవంతమైతే ఆ తర్వాత యూజర్లకు పరిచయం చేయనున్నది. ప్రస్తుతం వాట్సాప్‌లో యూజర్లు ఇతరులతో కమ్యూనికేట్‌ అవుతున్న సమయంలో ఫోన్‌ నంబర్‌ డిస్‌ప్లే అవుతుంది. దీంతో ప్రైవసీకి భంగం కలుగుతున్నది.


దీనికి పరిష్కారంగా యూజర్‌ నేమ్‌ పేరిట ప్రైవసీ ఫీచర్ లాంచ్ చేయబోతున్నది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఫీచర్‌ తీసుకురాబోతున్నది. వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) అప్‌డేట్‌ ప్రకారం.. కొత్త ఫీచర్‌తో యూజర్లు ప్రొఫైల్ సెక్షన్‌లో యూజర్లు తమకు నచ్చిన యూజర్‌నేమ్స్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. దాంతో వాట్సాప్‌లో తెలియని వ్యక్తులతో చాట్‌ చేసే సమయంలో నంబర్‌ కనిపించకుండా ఉంటుంది. కేవలం యూజర్‌ నేమ్‌ మాత్రమే కనిపిస్తుంది. తద్వారా కాంటాక్ట్‌ ఇనర్మేషన్‌ ఎవరికీ కనిపించదు. కాంటాక్ట్ సమాచారాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో యూజర్ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులకు ఫోన్ నంబర్ తెలియకుండా ఉండాలంటే యూజర్‌ నేమ్‌ను వాడితో సరిపోతుంది.


ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఫీచర్‌ ఉందని, త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని బీటా ఇన్ఫో రిపోర్ట్‌ పేర్కొంది. ఈ మేరకు ఓ స్క్రీన్‌ షాట్‌ను విడుదల చేసింది. ఇందులో వాట్సాప్‌ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో యూజర్‌నేమ్‌ను ఎంపిక చేసుకునేందుకు ప్రత్యేకంగా సెక్షన్‌ ఉండగా.. దానిపై ట్యాప్‌ చేసి నచ్చిన యూజర్‌ నేమ్‌ను సెట్‌ చేసుకోవచ్చని బీటా ఇన్ఫో రిపోర్ట్‌ పేర్కొంది. ఆల్ఫాన్యూమరిక్ లెటర్స్, కొన్ని స్పెషల్ లెటర్స్ కలయికతోనూ సెట్‌ చేసుకోవచ్చని.. అవి తప్పనిసరిగా వాట్సాప్‌లో యూనిక్‌గా ఉండాలని పేర్కొంది. యూజర్‌నేమ్‌ ఆప్షనల్ ఫీచర్ అని, యూజర్‌నేమ్‌ ద్వారా ఎవరితోనైనా చాట్ చేస్తున్న సమయంలో ఫోన్‌ నంబర్‌ హైడ్‌ అయి ఉంటుందని వివరించింది. ఫోన్ నంబర్ ఇప్పటికే తెలిసిన వారికి తప్ప.. ఇంకా వేరే ఎవరికీ ఫోన్ నంబర్ తెలిసే అవకాశమే ఉండబోదని తెలిపింది. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్ల ప్రైవసీ మరింత మెరుగుపడనున్నది.