Giri Nagu: రైతులను.. పరుగులు పెట్టించిన 15 అడుగుల గిరి నాగు..!
పాములు కనిపిస్తే చాలు..మనుషుల్లో వణుకు మొదలవుతోంది. అలాంటిది ఏకంగా 15అడుగుల భారీ గిరి నాగు కంటపడితే..కాదు కాదండోయ్..వెంట పడితే ఇక గుండె చేత పట్టుకుని పరుగు లంఘించుకోవాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Huge Snake Terror: : పాములు కనిపిస్తే చాలు..మనుషుల్లో వణుకు మొదలవుతోంది. అలాంటిది ఏకంగా 15అడుగుల భారీ గిరి నాగు(కింగ్ కోబ్రా) కంటపడితే..కాదు కాదండోయ్..వెంట పడితే ఇక గుండె చేత పట్టుకుని పరుగు లంఘించుకోవాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సహజంగా మనుషులు దగ్గరగా వస్తే పాములు దూరంగా వెళ్లిపోతాయి. కాని అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో 15 అడుగుల భారీ గిరి నాగు రైతులను భయపెట్టింది. తన దారిన తాను పోతుంటే పొలాల్లో కుక్కలు అడ్డుపడ్డాయి. ఇంకోవైపు స్థానిక రైతులు దానిని దగ్గరగా గమనిస్తూ అది ఎటు పోతుందో చూస్తున్నారు.
ఓ వైపు కుక్కలు..మరోవైపు రైతుల హంగామా..అంతే ఆ గిరినాగుకు చిర్రెత్తు కొచ్చింది. కోపంతో దిగ్గున పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతూ రైతులపైకి దూసుకెళ్లింది. అంత పెద్ద భారీ సర్పం అకస్మాత్తుగా తమవైపు మీదకు దూసుకురావడంతో రైతులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. రైతులు పరుగు లంఘించుకోవడంతో గిరినాగు తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాము..అందులో గిరినాగుతో చెలగాటం ప్రాణసంకటమని..అయినా తన తోవన తాను పోతున్న నాగును అనవసరంగా గెలికినందుకే అది రైతుల వెంట పడిందని కామెంట్ చేస్తున్నారు.
King Cobra: ఇంత పెద్ద నాగు పామును.. మీరు ఎప్పుడైనా చూసారా..?