Animal Dhoni: యానిమల్‌ ‘ధోని’.. ఫ్యాన్స్ పూన‌కాలు

Animal Dhoni: యానిమల్‌ ‘ధోని’.. ఫ్యాన్స్ పూన‌కాలు

Animal Dhoni:

విధాత: భారత స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే దేశంలో ఉండే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి, యానిమల్ (Animal) వంటి సినిమాలతో సంపాదించుకున్న క్రేజ్ కూడా చెప్పనవసరం లేదు. అలాంటి క్రేజీ స్టార్స్ ఇద్దరు కలిసి ఓ యాడ్ షూట్ చేయడం వైరల్ గా మారింది.

ధోని (Dhoni) ఎన్ని రకాల యాడ్స్ చేసినా కూడా సిల్వర్ స్క్రీన్ పై ధోని ని చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో ధోని చేసిన యాడ్ మాత్రం అభిమానులకి ధోనిని హీరోగా చూసేలా చేసింది. ఎలక్ట్రానిక్ సైకిల్ ఉత్పత్తి కంపెనీ ఈమోటోరాడ్ ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎంఎస్ ధోని నటించిన యాడ్ విడుదలై అభిమానుల్లో రచ్చ రచ్చ రేపుతోంది.

యానిమల్ (Animal) లో రణబీర్ ఎలాంటి హెయిర్ స్టైల్ తో ఉంటాడో సేమ్ అలాంటి హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ స్టైల్ తో ధోనితో ఈ యాడ్ లో సందీప్ వంగా నటింప చేశారు. 1నిమిషం 11 సెకన్లు ఉన్న ఆ హిందీ యాడ్ లో ధోని, సందీప్ మధ్య జరిగిన మాటలు కూడా యాడ్ కి అదనపు ఆకర్షణగా నిలిచాయి. యాడ్ చివరలో యానిమల్ మూవీ క్లైమాక్స్ లో రణబీర్ చేసిన సిగ్నేచర్ సైగని ధోని చేత కూడా దర్శకుడు సందీప్ రెడ్డి చేయించడం హైలెట్ గా నిలిచిందని దోని అభిమానులు సంబరపడుతున్నారు.  మేన‌రిజ‌మ్స్ కూడా రీ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇవి సోష‌ల్ మీడియాను దున్నేస్తుండ‌గా.. ఫ్యాన్స్ తెగ ఎంజామ్ చేస్తున్నారు.