cm on hydra । హైడ్రా భవిష్యత్తు పనితీరుపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో.. చెరువుల ఆక్రమణలపై తమ ప్రభుత్వం యుద్ధం చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు.

cm on hydra । హైడ్రా భవిష్యత్తు పనితీరుపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
  • కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనలే మాకు స్ఫూర్తి
  • చెరువుల ఆక్రమణలపై యుద్ధం చేస్తున్నాం
  • రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు
  • కోట్ల మంది దాహార్తిని తీర్చే చెరువులు
  • వాటి పరిధిలో విలాసాల కోసం ఫామ్‌హౌస్‌లు
  • వాటి నుంచి చెరువుల్లోకి వ్యర్థ జలాలు
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
  • హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన

cm on hydra । కురుక్షేత్ర యుద్ధం (Kurukshetra war) సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు (Lord Krishna) చేసిన బోధనల స్పూర్తితో.. చెరువుల ఆక్రమణలపై (encroachment) తమ ప్రభుత్వం యుద్ధం చేస్తున్నదని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలు (future generations) బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా చెరువుల ఆక్రమణదారుల భరతం పడతామని తేల్చి చెప్పారు. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా తమ ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుందన్నారు. ఈ క్రమంలో చెర నుంచి చెరువులను విడిపించేందుకే హైడ్రాను (hydra) ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

 

వందేళ్ల క్రితమే హైదరాబాద్‌ను నాటి నిజాం పాలకులు (Nizam rulers)  లేక్ సిటీగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కానీ.. కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో  విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్‌లు (farm houses) నిర్మించుకున్నారని, నగరానికి తాగునీరు అందించే గండిపేట్ (Gandipet), హిమాయత్ సాగర్(Himayat Sagar) లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధజలాలు  (waste water) వదులుతున్నారని చెప్పారు. వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి వ్యర్థ్యమేనని వ్యాఖ్యానించారు. అందుకే.. చెరబట్టిన వారి నుంచి చెరువులను హైడ్రా ద్వారా  విడిపిస్తున్నామని చెప్పారు. కోకోపేటలో (Kokopeta) నిర్మించనున్న హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌ (Hare Krishna Heritage Tower) శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. టవర్‌ నమూనాను ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే (once in a lifetime) ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందని, ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం తన జన్మ సకృతమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాంక్రీట్ జంగిల్‌లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ టవర్ 430 అడుగుల ఎత్తుతో నిర్మితం కానుండటం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మణం పూర్తి అవుతుందని, దానిని మళ్లీ మనమే ప్రారంభించుకుంటామని అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప సందర్భమని చెప్పారు. విద్య ((education), వైద్యం (helath) ప్రభుత్వ ప్రాధాన్యతలన్న ముఖ్యమంత్రి.. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, క్యాన్సర్ ఆస్పత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ సహకారాన్ని కోరారు. ఇందుకోసం ప్రభుత్వంవైపు నుంచి మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu), ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. నమూనాను ఆవిష్కరించారు.