Sahara Desert । ఆ ఎడారిలో అత్యంత అతి భారీ వర్షాలు! వాతావరణ పెను మార్పులకు సంకేతాలా?
సెప్టెంబర్‌లో సహారా ఎడారిలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. భారీ అంటే అలాంటిలాంటి భారీ వర్షాలు కావండోయ్. సాధారణ వర్షపాతం కంటే 500 రెట్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని ‘సివియర్ వెదర్ యూరోప్’ పేర్కొన్నది.

Sahara Desert । కనుచూపు మేర ఇసుకమేటలు ఉండే ఎడారుల్లో వర్షం పడటమంటే విడ్డూరమే! అదులోనూ ప్రపంచంలోనే అతిపెద్దదైన.. ప్రపంచంలోనే అత్యంత పొడివాతావరణం కలిగి ఉండే సహా ఎడారిలో పడటం అంటే! ఇదేదో సీరియస్ అంశమే. తాజా వార్తల ప్రకారం.. సెప్టెంబర్‌లో సహారా ఎడారిలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. భారీ అంటే అలాంటిలాంటి భారీ వర్షాలు కావండోయ్. సాధారణ వర్షపాతం కంటే 500 రెట్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని ‘సివియర్ వెదర్ యూరోప్’ పేర్కొన్నది. ఈ లెక్కన అక్కడ కురిసే వర్షం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో సాధారణ వర్షపాతం కంటే 500 రెట్ల వర్షపాతం సహారా ఎడారిలోని ఎక్కువ భాగంలో కురుస్తుందని తెలిపింది.
సహారా ఎడారిలో ఇటువంటి అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయి. సగటున దశాబ్దానికి ఒకసారి ఇటువంటి పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. ఈ పరిణామం భూమి వాతావరణ వ్యవస్థలో శక్తిమంతమైన మార్పునకు సంకేతాలని అంటున్నారు. ఇది అసాధారణ వాతావరణ పరిస్థితి అని చెబుతున్నారు. అత్యంత తక్కువ నుంచి సున్నా వర్షపాతం ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. అలాంటిది ఐదు వందల రెట్ల వర్షపాతాన్ని సహారా చవిచూడబోతున్నది. భూమిపై ఉన్న అత్యంత పొడివాతావరణం ఉండే భారీ ఏడారి సహారా. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకూ విస్తరించి ఉంటుంది. అంటే.. సుమారు 9.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు అన్నమాట.