TGRTC Mahalakshmi Scheme| ఆర్టీసీలో మహాలక్ష్మి రయ్ రయ్!

TGRTC Mahalakshmi Scheme| ఆర్టీసీలో మహాలక్ష్మి రయ్ రయ్!

విధాత : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Government) ఎన్నికల హామీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ వసతి కల్పనకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ఆర్టీసీ(Telangana RTC)లో సరికొత్త రికార్డు సాధించింది. డిసెంబర్ 9, 2023 నుండి జూలై 21, 2025 వరకు, మహాలక్ష్మి పథకం కింద 200 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించారని ఆర్టీసీ తెలిపింది. తద్వారా మహిళలకు రూ.6,671.12 కోట్లు పొదుపు అయ్యాయని పేర్కొంది. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు..అభివృద్ధికి కాదు, ఆత్మవిశ్వాసానికి బస్సు టికెట్టు అని..ఆడబిడ్డ అడుగుకు అర్థం చెప్పిన పాలనకు ఇది గొప్ప ఉదాహరణ అని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

ఈ పథకంతో ప్రతి మహిళ భయంతో కాకుండా ధైర్యంతోగమ్యానికి చేరుకుంటోంది..ఇది ప్రభుత్వం అందించిన ఓ భరోసా..ఇది మార్పు మొదలైన దశ అని అభివర్ణించారు. ఈ పథకాన్ని రోజూ విజయవంతంగా నడిపిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు , సిబ్బంది, యాజమాన్యంకు అందరి శ్రమకు పొన్నం వందనం తెలిపారు. మీరు నడుపుతున్నది బస్సులు కాదు..ఓ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఇదే నిజమైన సంక్షేమ పాలనకు అద్దం.. మహిళా సాధికారతకు అడుగులు పడుతున్న పాలన అని..ఇదే ప్రజల ఆశలకు రూపం ఇచ్చిన అభివృద్ధి అని చెప్పుకొచ్చారు.