BJP టార్గెట్‌ జిల్లాకో ఎమ్మెల్యే..?

విధాత: మునుగోడు ఉప ఎన్నిక‌పై బీజేపీ దూకుడు పెంచింది. సెప్టెంబ‌ర్ 17న విమోచ‌న దినోత్స‌వాల‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే పార్టీ ముఖ్య‌ నేత‌ల‌పై స‌మావేశ‌మై పార్టీ ప‌టిష్ట‌త గురించి, చేరిక‌ల గురించి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. అలాగే మునుగోడు ఉప ఎన్నిక‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో బీజేపీ గెలువాల్సిందేన‌ని, ఎలా ముందుకు వెళ్లాలో నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా కొత్త జిల్లాల ప్ర‌కారం జిల్లాకు […]

  • By: krs    latest    Sep 24, 2022 2:07 PM IST
BJP టార్గెట్‌ జిల్లాకో ఎమ్మెల్యే..?

విధాత: మునుగోడు ఉప ఎన్నిక‌పై బీజేపీ దూకుడు పెంచింది. సెప్టెంబ‌ర్ 17న విమోచ‌న దినోత్స‌వాల‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే పార్టీ ముఖ్య‌ నేత‌ల‌పై స‌మావేశ‌మై పార్టీ ప‌టిష్ట‌త గురించి, చేరిక‌ల గురించి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

అలాగే మునుగోడు ఉప ఎన్నిక‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో బీజేపీ గెలువాల్సిందేన‌ని, ఎలా ముందుకు వెళ్లాలో నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా కొత్త జిల్లాల ప్ర‌కారం జిల్లాకు ఒక‌టి చొప్పున 33 స్థానాలు గెలిచేలా కార్య‌చర‌ణ రూపొందించుకోవాల‌ని సూచించార‌ట‌. త‌ర్వాత సంగ‌తి తాము చూసుకుంటామ‌ని నేత‌ల‌కు చెప్పిన‌ట్టు తెలిసింది.

మునుగోడు ఉప ఎన్నిక‌: మండ‌ల ఇన్‌ఛార్జీలు వీరే

అమిత్ షా వెళ్లిన త‌ర్వాత బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం మొత్తం మునుగోడు ఉప ఎన్నిక‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్ర‌చారం ముమ్మ‌రం చేయ‌డానికి మండ‌ల ఇన్‌ఛార్జ్‌ల‌ను నియ‌మించింది.

చౌటుప్ప‌ల్ రూర‌ల్ మండ‌లానికి కూన శ్రీ‌శైలం గౌడ్‌, చౌటుప్ప‌ల్ మున్సిపాలిటీకి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, నారాయ‌ణ‌పూర్ మండ‌లానికి ర‌ఘునంద‌న్‌రావు, మునుగోడు మండ‌లానికి చాడ సురేష్‌రెడ్డి, చండూరు మండ‌లానికి టి. నందీశ్వ‌ర్ గౌడ్‌, చండూరు మున్సిపాలిటీకి మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మారావు, నాంప‌ల్లి మండ‌లానికి ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, మ‌ర్రిగూడెం మండ‌లానికి కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి నియ‌మించింది.