TSRTC | ఆర్టీసీ దసరా కానుక.. ముందస్తు టికెట్లపై 10శాతం రాయితీ
TSRTC విధాత: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ పండుగ కానుక ప్రకటించింది. ఆక్టోబర్ 15నుంచి 29వ తేదీల మధ్య ప్రయాణానికి రానుపోను టికెట్లను ముందస్తుగా ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10శాతం రాయితీ ప్రకటించింది. ఈనెల 30వ తేదిలోపు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

TSRTC
విధాత: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ పండుగ కానుక ప్రకటించింది. ఆక్టోబర్ 15నుంచి 29వ తేదీల మధ్య ప్రయాణానికి రానుపోను టికెట్లను ముందస్తుగా ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10శాతం రాయితీ ప్రకటించింది.
ఈనెల 30వ తేదిలోపు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించారు.