Uttarakhand | ఉత్తరాఖండ్‌లో విషాదం.. ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది మృతి
Uttarakhand విధాత: ఉత్తరాఖండ్‌లో విషాదం నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది మృతి చెందారు. జిల్లాలోని అలకనంద నదీ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. న్యాయపరమైన విచారణకు […]

Uttarakhand
విధాత: ఉత్తరాఖండ్‌లో విషాదం నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది మృతి చెందారు. జిల్లాలోని అలకనంద నదీ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు.
ఈ పేలుడు ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. న్యాయపరమైన విచారణకు సీఎం ఆదేశించారు.
చమోలి జిల్లా ఎస్‌పీ ప్రమేంద్ర ధోవల్ మాట్లాడుతూ.. ఈ గత రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తమకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా.. 21 మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వీరందరికి తీవ్ర గాయాలయ్యాయి. 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని, మిగతా వారికి చికిత్స కొనసాగుతోందని ఎస్‌పీ తెలిపారు.