Warangal | వరదలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం

Warangal జంపన్న వాగులో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం గుర్తించిన మల్యాల గ్రామస్తులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిద ప్రాంతాల్లో గురువారం వరద సృష్టించిన బీభత్సానికి 19 మంది వరకు గల్లంతయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి,మల్యాలలో వరద నీటిలో పదిమంది కొట్టుకుపోయారు. వరద ఉధృతికి సమీప బంగ్లాలు ఎక్కిగ్రామస్తులు బిక్కు బిక్కుమంటున్నారు. భూపాలపల్లి జిల్లా మోరంచ వాగు ఉధృతి వల్ల ఐదుగురు గల్లంతయ్యారు. హనుమకొండ గోపాలపురం చెరువులో గట్టు […]

Warangal | వరదలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం

Warangal

  • జంపన్న వాగులో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం
  • గుర్తించిన మల్యాల గ్రామస్తులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిద ప్రాంతాల్లో గురువారం వరద సృష్టించిన బీభత్సానికి 19 మంది వరకు గల్లంతయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి,మల్యాలలో వరద నీటిలో పదిమంది కొట్టుకుపోయారు. వరద ఉధృతికి సమీప బంగ్లాలు ఎక్కిగ్రామస్తులు బిక్కు బిక్కుమంటున్నారు.

భూపాలపల్లి జిల్లా మోరంచ వాగు ఉధృతి వల్ల ఐదుగురు గల్లంతయ్యారు. హనుమకొండ గోపాలపురం చెరువులో గట్టు రాజు గల్లంతై మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా, పెద్ద వంగర మండలం, పోచంపల్లి లో వరదలో అన్నదమ్ములు పిండి యాకయ్య, పిండి శ్రీనివాస్ కొట్టుకుపోయి చనిపోయారు. ఇందులో ఐదుగురి మృతదేహాలు నిన్ననే లభ్యమయ్యాయి. శుక్రవారం ఆరుగురి మృతదేహాలు పంటపొలాల్లో లభ్యమయ్యాయి.

దీనికి వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం దొడ్ల – మల్యాల గ్రామల మధ్య ఉన్న జంపన్న వాగు గురువారం ఉప్పొంగడంతో వరద ఉదృతి ఒక్క సారిగా పెరిగింది. దీనితో ఏడుగురు వరద నీటిలో కొట్టుకు పోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రషీద్ , షరీఫ్ , అజ్జు ,మహబూబ్ ఖాన్, మరో నలుగురు వ్యక్తులు గల్లంతైన వారిలో ఉన్నారు. కాగా గల్లంతైన వారిలో ఆరుగురు మృత్యువాత పడినట్లు మృతదేహాలను గ్రామస్తులు శుక్రవారం గుర్తించినట్లు సమాచారం.