Telangana | వైన్ షాపులకు, బార్లకు 24 గంటల నిబంధన వర్తించదు..
Telangana | రాష్ట్రంలో 24 గంటల పాటు దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తూ రాష్ట్ర కార్మిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులు(జీవో నంబర్ 4) ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించవు అని ఆమె స్పష్టం చేశారు. అంటే వైన్ షాపులకు( Wine Shops ), బార్లకు 24 గంటల నిబంధన వర్తించదు. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం టీఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టిలరీలు, […]

Telangana | రాష్ట్రంలో 24 గంటల పాటు దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తూ రాష్ట్ర కార్మిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఉత్తర్వులు(జీవో నంబర్ 4) ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించవు అని ఆమె స్పష్టం చేశారు. అంటే వైన్ షాపులకు( Wine Shops ), బార్లకు 24 గంటల నిబంధన వర్తించదు.
ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం టీఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టిలరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు ప్రత్యేక సమయం ప్రకారమే తెరిచి ఉంటాయన్నారు.
జీవో నంబర్ 4 కింద ఇచ్చిన 24 గంటలు దుకాణాలు తెరిచే నిబంధన అన్ని దుకాణాలకు ఆటోమేటిక్‌గా వర్తించదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతనే దుకాణాలు 24 గంటలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.