China | చైనాలో భారీ పేలుడు.. 31 మంది మృతి

China | చైనాలోని నింగ్జియాలో బుధ‌వారం రాత్రి భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో 31 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బుధ‌వారం సాయంత్రం నింగ్జియాలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో వంట కోసం వినియోగించే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ట్యాంక్ పేల‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. గ్యాస్ ట్యాంక్ పేల‌డంతో ఆ రెస్టారెంట్‌లో ఉన్న 31 మంది మ‌ర‌ణించార‌ని తెలిపారు. హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి […]

China | చైనాలో భారీ పేలుడు.. 31 మంది మృతి

China | చైనాలోని నింగ్జియాలో బుధ‌వారం రాత్రి భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో 31 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

బుధ‌వారం సాయంత్రం నింగ్జియాలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో వంట కోసం వినియోగించే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ట్యాంక్ పేల‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. గ్యాస్ ట్యాంక్ పేల‌డంతో ఆ రెస్టారెంట్‌లో ఉన్న 31 మంది మ‌ర‌ణించార‌ని తెలిపారు.

హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న సిబ్బంది.. తీవ్రంగా గాయ‌ప‌డిన ఏడుగురిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు. వీరంతా కాలిన గాయాల‌తో తీవ్రంగా బాధ‌ప‌డుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌న్నారు. పేలుడు ధాటికి రెస్టారెంట్ ఫ‌ర్నీచ‌ర్ పూర్తిగా ధ్వంస‌మైంద‌ని తెలిపారు. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను పూర్తిగా అదుపు చేసింది.

అయితే.. ఇక్క‌డ జ‌రిగే మూడు రోజుల డ్రాగ‌న్ బోట్ పండ‌గ‌ల‌కు వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌తో న‌గ‌రం కోలాహ‌లంగా ఉండ‌గా.. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం విచార‌క‌ర‌మ‌ని స్థానికుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. రెస్టారెంట్ పేలుడు శ‌బ్దం ఇంచుమించు 50 మీట‌ర్ల వ‌ర‌కు వినిపించింద‌ని పేర్కొన్నారు.

ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ఒక వెయిట‌ర్ మంట‌ల్లో కాలుతూ బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని.. కొద్ది సెక‌న్ల‌కే ఆయ‌న కుప్ప‌కూలి పోయార‌ని చెన్ అనే మ‌రో యువ‌తి తెలిపారు. చైనా ప్ర‌భుత్వ ఉదాసీన‌త‌, యాజ‌మాన్యాల పొదుపు చ‌ర్య‌ల వ‌ల్ల రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో అగ్ని ప్ర‌మాదాలు నిత్య‌కృత్యంగా మారాయ‌ని స్థానిక మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది.