పాక్‌లో పేలుడు.. 52 మంది దుర్మ‌ర‌ణం

పాక్‌లో పేలుడు.. 52 మంది దుర్మ‌ర‌ణం
  • మ‌రో 50 మంది వ‌ర‌కు గాయాలు
  • మిలాద్ ఉన్ న‌బీ ర్యాలీ ర‌క్త‌సిక్తం


విధాత‌: పాకిస్తాన్‌లో బాంబు పేల‌డంతో 52 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో50 వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం మిలాద్ ఉన్ న‌బీ సంద‌ర్భంగా చేప‌ట్టిన ర్యాలీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మస్తుంగ్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్ల‌డించారు.


డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవాజ్ గిష్కోరి వాహనం సమీపంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని సీనియర్ స్థానిక పోలీసు అధికారి జావేద్ లెహ్రీ తెలిపారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

పేలుడుతో మిలాద్ ఉన్ న‌బీ ర్యాలీ ర‌క్త‌సిక్తం మారింది. అక్క‌డి వాతావ‌ర‌ణ భ‌యంక‌రంగా మారింది. ర‌క్త‌మోడుతున్న క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన స‌మీప ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. బలూచిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లో గతంలో ఇస్లామిస్ట్, వేర్పాటువాద తీవ్రవాదుల దాడులు జరిగాయి. ఇటీవల ఇదే జిల్లాలో జరిగిన పేలుడులో జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ (JUI-F) నాయకుడు హఫీజ్ హమ్దుల్లాతో సహా 11 మంది గాయపడ్డారు.