నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి

Earthquake in Nepal | విధాత: నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపానికి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 5 గంటల వ్యవధిలోనే నేపాల్‌లో రెండు సార్లు భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి 8:52 గంటల సమయంలో తొలిసారి భూకంపం ఏర్పడింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. మళ్లీ బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ధోతి […]

నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి

Earthquake in Nepal | విధాత: నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపానికి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 5 గంటల వ్యవధిలోనే నేపాల్‌లో రెండు సార్లు భూకంపం సంభవించింది.

మంగళవారం రాత్రి 8:52 గంటల సమయంలో తొలిసారి భూకంపం ఏర్పడింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. మళ్లీ బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ధోతి జిల్లాలో పలు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఆరుుగురు వ్యక్తులు మృతి చెందారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.