బుద్ధవనం సందర్శించిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ బృందం

విధాత: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని మంగళవారం కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన డ్యాము, కాలువలు, ఎస్ఎల్‌బిసిలను బుధవారం కృష్ణానది యాజమాన్య బోర్డ్ సభ్యులు సందర్శించి పరిశీలించనున్నారు. సాగర్ ప్రాజెక్టు పరిశీలనకు ఒక రోజు ముందు వచ్చిన బోర్డు సభ్యులు నాగార్జున కొండ మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్తూప వనాన్ని సందర్శించి […]

బుద్ధవనం సందర్శించిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ బృందం

విధాత: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని మంగళవారం కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన డ్యాము, కాలువలు, ఎస్ఎల్‌బిసిలను బుధవారం కృష్ణానది యాజమాన్య బోర్డ్ సభ్యులు సందర్శించి పరిశీలించనున్నారు.

సాగర్ ప్రాజెక్టు పరిశీలనకు ఒక రోజు ముందు వచ్చిన బోర్డు సభ్యులు నాగార్జున కొండ మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్తూప వనాన్ని సందర్శించి మహాస్థూపాన్ని వీక్షించారు.

వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. అనంతరం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుడు ఏ.అజయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ బుద్ధ వనం మహా స్తూపం దానిలోని ధ్యాన మందిరం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. వీరితోపాటు కృష్ణానది యాజమాన్య బోర్డు ఎస్ ఇ అశోక్ కుమార్, ఇ ఇలు శివ ప్రసాద్, రాఘవేంద్రరావు, సాగర్ డ్యామ్ మల్లికార్జునరావు, డి ఈ లు సుదర్శన్, శ్రీనివాస్, ఏ ఈ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.