ఉపాధ్యాయునికి కన్నీటి వీడ్కోలు.. తరలివచ్చిన ఉపాధ్యాయుల బృందం

నివాళులర్పించిన జిల్లా విద్యాధికారి రమేష్ కన్నీటి మయమైన సాయినగర్ కాలనీ రాజ్‌పల్లిలో అంత్యక్రియలు విధాత, మెదక్ బ్యూరో: భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.. అన్యోన్యంగా ఉండే కుటుంబం, ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉపాధ్యాయుడు పెద్దోళ్ల పెంటయ్య(46) మృతి చెందగా సోమవారం మధ్యాహ్నం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీలోని స్వగృహంలో ఉంచిన పార్టివ దేహానికి జిల్లా విద్యాధికారి […]

  • By: Somu    latest    Feb 13, 2023 12:57 PM IST
ఉపాధ్యాయునికి కన్నీటి వీడ్కోలు.. తరలివచ్చిన ఉపాధ్యాయుల బృందం
  • నివాళులర్పించిన జిల్లా విద్యాధికారి రమేష్
  • కన్నీటి మయమైన సాయినగర్ కాలనీ
  • రాజ్‌పల్లిలో అంత్యక్రియలు

విధాత, మెదక్ బ్యూరో: భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.. అన్యోన్యంగా ఉండే కుటుంబం, ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉపాధ్యాయుడు పెద్దోళ్ల పెంటయ్య(46) మృతి చెందగా సోమవారం మధ్యాహ్నం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీలోని స్వగృహంలో ఉంచిన పార్టివ దేహానికి జిల్లా విద్యాధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాధికారి నీలకంఠం, కౌన్సిలర్ సంయుద్దీన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మల్లారెడ్డి, వెంకట్‌రామ్ రెడ్డి, సంగయ్య, సబ్బాని శ్రీనివాస్, సుంకరి కృష్ణ, ప్రణీత్, నరేందర్ రెడ్డి, ప్రణీత్, రాజ గోపాల్ గౌడ్, ఎల్లమ్, పద్మారావు, మార్గం రాజు, గౌడ్, మధు, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, పోషేట్టి సంతోష్, రవీందర్, చిలుకరాజు, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు వందలాది మంది ఉపాధ్యాయులు, సాయినగర్ కాలనీ అధ్యక్షులు మళ్లగారి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నాగ భూషణం, సలహాదారులు ప్రభుగౌడ్, కంది శ్రీనివాస్ రెడ్డి, నవీన్, బుజంగ రెడ్డి, లింగం, మురళి, కరుణాకర్, వెంకటేశం, మల్లారెడ్డి, తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

తరలివచ్చిన రాజ్‌పల్లి

మెదక్ మండలం రాజ్‌పల్లికి చెందిన గ్రామ సర్పంచ్, ఎలక్షన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మార్గం నాగరాజు, కిషన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, తదితరులు మెదక్‌కు చేసుకొని మృతునికి నివాళులర్పించారు. మృతుని భార్య, పిల్లలను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

చూపరుల హృదయలను కదిలించింది. సాయినగర్ కాలనీ నుంచి మొదలైన అంతిమయాత్ర రాజ్‌పల్లి వరకు సాగింది. రాజ్‌పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బంధువులు, హప్తులు వెంటరాగా ఉపాధ్యాయుడు పెద్దోళ్ల పెంటయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు.