రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ సోదరుడికి గాయాలు
విధాత, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ గాయపడ్డారు. అలాగే ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి బండిపురాకు వెళ్తున్న సమయంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన వెంట కాన్వాయ్ కూడా వెంటే ఉన్నది. మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలో కడ్కోల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. […]

విధాత, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ గాయపడ్డారు. అలాగే ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి బండిపురాకు వెళ్తున్న సమయంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన వెంట కాన్వాయ్ కూడా వెంటే ఉన్నది.
మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలో కడ్కోల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రహ్లాద్ మోదీ మనవడి కాలు ఫ్రాక్చర్ కావడంతో పాటు తలకు గాయాలయ్యాయి. మిగతా కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు.
వారందరినీ మైసూరులోని జేఎస్ ఆసుప్రతికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ధ్వంసమైన కారును బుల్డోజర్ సాయంతో కారును అక్కడి నుంచి తరలించారు.